Monday, March 30, 2009

సంపూర్ణ మద్యపాన నిషేధం ఎందుకు సాధ్యం కాదు ?

నాటి ఎన్.టి ఆర్ ప్రమాణ స్వీకార ఉత్సవము లో సంపూర్ణ మద్య పాన నిషేధం పై చేసిన మొదటి చేవ్రాలు నిర్లజ్జగా చేరిపివేసిన అపర చాణిక్య సారద్యం లోని నాటి తె. దే. పా ప్రభుత్వం ,
ప్రజల ఆరోగ్యమే మహాభాగ్యం అని "ఆరోగ్య శ్రీ" ద్వారా ప్రభోదిస్తున్న అపర ధన్వంతరి సారద్యం లోని నేటి కాంగ్రెస్ ప్రభుత్వం,.
ఈ ఎన్నికల వేళ ప్రజల కు సంపూర్ణ మద్య పాన నిషేధం ఎందుకు సాద్యం కాలేదో, ఎందుకు సాద్యం కాదో వివరణ ఇచ్చుకుని తీరాలి.
ఒకరు ఎన్ టి ఆర్ ఆశయాలకు వారసుడని మరొకరు ఇందిరమ్మ రాజ్యమని గొప్పలు చెప్పుకుంటున్న వీరిద్దరూ ప్రజా నాయస్థానం లో దోషులు గా నిల బడి తీర వలసిందే .
తమ్ముళ్ళ ఆరోగ్యాన్ని పణం గా పెట్టి చెల్లెమ్మల పసుపు కుంకుమల తో చెలగాటం ఆడుతున్న వారు ఎన్ టి ఆర్ కు ,ఇందిరా గాంధి ల ఆశయాలకు ఎలా వారసులు అవుతారు అని ప్రజలు నిల దీస్తున్నారు ?
పేద, మద్య తరగతి బ్రతుకులు చితుకులు చేసే, వాళ్ల కష్టాలు ,కన్నీళ్లు తో వ్యాపారం చేసి, ఎక్సైజు వాళ్ళు తో దగ్గరుండి మరి త్రాగిపించి ప్రోగేసిన పాపిష్టి ఆదాయం తో తప్ప ప్రభుత్వాలు నడప లేరా ? ధన సంపాదన కు ఎ మార్గమైన పర్వాలేదు అనుకుంటే ఒక్క మద్యపానమే ఏమి ఖర్మ! మాదక ద్రవ్యాలు, వ్యభిచారం వంటి అనేకమైన నీచమైన మార్గాలు ఉన్నాయ్. కాని ప్రజల ఆరోగ్యాని కి హాని కలిగించే ఇలాంటి వ్యాపారాలు ప్రజా ప్రభుత్వాలు చేయ కూడదు.
మీరే మందు త్రాగించి , ఆనక జబ్బు చేస్తే ఆరోగ్య శ్రీ పధకం లో ఆపెరేషన్ చేయస్తారా ?
కూలి నాలి చేసుకుని సంపాదించుకున్న డబ్బులు మందు కు తగలేసి భార్య బిడ్డలు పస్తులు పడుకుంటే , రెండు రూపాయల బియ్యం బిక్షం వేస్తారా ?
ప్రజల పన్నులు , ప్రజల భూములు ,ప్రజల ఆస్తులు , ప్రజల బ్రతుకులు, ప్రజల ఆరోగ్యం దోచుకుంటూ ఆనక ఎంగిలి మెతుకులు లాంటి ప్రజా సంక్షేమ పధకాల తో ప్రజలను బిక్ష గాళ్ళు గా మార్చటమేనా మీ పరిపాలనా విధానం ?
ఇవా మీ ప్రజా సంక్షేమ పధకాలు ?
ఇదేనా దేవుని పాలన ?
మద్యమే లేకపోతే మీ “అర్యోగ్య శ్రీ” , మీ “బిక్షన్దేహి” పధకాలు ప్రజలకు అవసరమా ?
ప్రజలంతా ఆరోగ్యం గా ఉండి స్వయం కృషి తో బాగుంటే మీ "చస్తే భీమ" పధకాలు అక్కర లేదు కదా !
బెల్టు షాపు లు ముసివేస్తారా ?
పత్రికలలో ప్రచారాలు ద్వారా ప్రజల లో చైతన్యం తెస్తారా?
అంగట్లో మందు పెట్టి కొట్టకుండ ఉండ మంటారా ?
ప్రజల తో "నిగ్రహ సాదన " చేయస్తారా ఏమిటి ?
ప్రజ లు సంసారులు , సన్యాసులు కారు . మీ ఘనమైన పాలన లో వారి బ్రతుకులు బాదలు, బలహీనతలను కలపోసిన యదార్ధ జీవిత వ్యదార్ధ గాధలు .
అంచెలు అంచెలు గా మద్య పాన నిషేధం విదిస్తాం అంటే గత ప్రభుత్వాల నిర్వాకం అనుభవ పూర్వకం గా తెలిసిన ప్రజలు, ప్రజారాజ్యం చేస్తున్న అదే హామీని మనస్పూర్తి గా స్వాగతించలేరు !
అసలు ప్రభుత్వం మద్యం వ్యాపారం చేయటం ఏమిటి ?
ప్రజల కు శ్రేయో రాజ్యం అందించవలసిన ప్రభుత్వాలు ప్రజా ఆరోగ్యం కు ముప్పు గా వాటిల్లిన మద్యం మహమ్మారిని ఎలా ప్రోత్సహిస్తుంది ?
రోజు మద్యం త్రాగి వచ్చిన భర్తల చేతులలో హింస కు గురి అవుతున్న మహిళా ల ఆక్రందనలు ఈ బదిర ప్రభుత్వాల కు విన పడటం లేదా ?
మహిళల పై అత్యాచారం ల కు మద్యం ప్రేరణ కాదా ?
అనేక రోడ్ ప్రమాదలకు అతి వేగం తో బాటు మద్యం సేవించుట కుడా ఒక కారణం కాదా ?
మద్య పానం నిషేదించ కుండా నేటి పురుషాదిక్య ప్రపంచం లో మహిళా సాదకారిత సాద్యమా ?
సిరిసిల్ల మృత్య ఘోష మర్చిపోయారా ?
గంగదేవపల్లి ఆదర్శాలు మాసి పోయాయా ?
మన వెనకనే కొలువైన మహాత్ముని స్ఫూర్తి ఏమి అయి పోయింది ?
లేక పొతే ఎందుకు ఈ ఊగిసలాట ?
ఆదాయ వనరలు పై భయ సందేహాలా ? అలాంటి అప్పుడు అంచెలు అంచెల గా మాత్రం అది ఎలా సాద్యం ?
కల్తీ సారా , దొంగ రవాణా సాకులు చెప్పద్దు అవి అవినీతి ప్రభుత్వాలు చెపుతాయి.
మద్య పాన నిషేధం పై స్పందించ వలసింది హృదయం తో- బుద్ది తో కాదు .
నిజానికి నేటి సమాజం లో పేరుకు పాయిన భయంకరమైన దురాచారా ల లో అవినీతి తరువాత మద్యమే తీవ్రమైన సమస్య . పేద మద్య తరగతి ప్రజల ఆర్ధిక స్థితి గతులను చిన్నా భిన్నం చేస్తున్న అతి తీవ్రమైన దుర్వ్యసనం ఇది.
అందుకే ఆంధ్రులు చేత "అన్నగారు" అని ఆనాడు పిలిపించుకున్న ఎన్ టి ఆర్ తన మొదటి వేటు మద్య పానం పై వేసాడు .
మరి "అన్నయ్యా" అని నేడు అంత కన్నా ఆప్యాయం గా పిల్స్తున్న తమ్ముళ్ళ కు చెల్లల్లు కు తిరగపెట్టిన ఈ సమస్యకు చిరంజీవి చూపే పరిష్కారం ఏమిటి ?
సంపూర్ణ మద్య పాన నిషేధం అధికారం లో వచ్చిన తక్షణం అమలు చేస్తాను అని ఎందుకు ప్రకటించలేక పోతున్నారు ?
ఈ “అందరి వాడు” పాలనలో కూడా అందరి ఇళ్ళల్లో "గోవింద రాజులు" ఉండవలసిందేనా ?
ప్రజలు అజెండా ఏ మా అజెండా! మా కంటూ ప్రత్యేక అజండా ఏమీ లేదు అని ఎలుగెత్తి చాటిన ఓ ప్రజా సేవకుడా!
ప్రజలు ముఖ్యం గా మన మహిళలు మందు కావాలని ముక్త కంఠం తో ఎమి కోరుకోవటం లేదే!
నిజానికి మందు మహమ్మారిని పారద్రోలమని మొర పెట్టుకుంటున్నారు !!!
మరి మన లో సగ భాగమైన మహిళా ప్రజా అభీష్టం మన్నించి మద్యపానం పై సంపూర్ణ నిషేధం విధించి మహిళా హృదయాలలో చిరంజీవి గా నిలిచి పోరాదా ?

ఈ ఎన్నికలలో కాంగ్రెస్ ,టి డి పి ఒకరి పై ఒకరు పోటి పడి ఇస్తూన్న హామీలకు హద్దే లేదు !
వీరు చెయ్యని వాగ్దానం అంటు ఎమి లేదు. ఒక్క మద్య పాన నిషేధం తప్ప !
మనసు ఉంటే మార్గం ఉంటుంది .
ఎలా చేస్తాం అన్నది వివరం గా మనం ఎవరకూ చెప్పవలసిన అవసరము లేదు
ఒక్క ఎన్ టి ఆర్ ఎలా చేసాడో అలాగా అని తప్ప!
అది మనమే చేస్తే !
ప్రజలు నీరాజనం పట్టారా ?
ప్రజారాజ్యాని కి పట్టాభిషేకం చేయరా ?
అసాధ్యాలు సుసాధ్యాలు చేయటమే సాహసికుల లక్షణం !
అమోఘమైన ప్రజా సమ్మోహన శక్తి , నిష్కల్మషమైన రాజకీయ చరిత్ర ,అమేయమైన అభిమానుల అంగ బలం ఉన్న మీకు ఈ నిర్ణయం అసాద్యమా ?
మనం కోరుతున్న మార్పు మనతోనే మొదలవ్వాలి
సంపూర్ణ మద్యపాన నిషేధమే మహాత్మునికి మనం అర్పించే ఘనమైన నివాళి !