Tuesday, December 14, 2010

ఒక రామోజీ, ఒక రాధాక్రిష్ణ లాబీయింగ్ చేయకుండానే ఈ స్థాయికి వచ్చారా?

జర్నలిజం కాలేజీలలో సీటుకోసం దరఖాస్తు చేసుకునే అమ్మాయిలను...'తల్లీ...నీ రోల్ మోడల్ ఎవరు?' అని అడిగితే...తొభై శాతం మంది బర్ఖాదత్ పేరు చెబుతారు. అలాగే ఆమె పేరు చెప్పి..."ఇండియన్ జర్నలిజం స్కూల్"లో సీటు పొందిన ఒక ఉత్సాహవంతురాలైన విద్యార్థిని మాట్లాడుతూ..."సార్...మీరు అడిగినప్పుడు బర్ఖా దత్ పేరు చెప్పాను. ఈ టేపుల గొడవ చూశాక నా గుండె పగిలిపోయింది సార్...." అని అమాయకంగా చెప్పింది.
ఇప్పుడంతా బర్ఖా మీద పడి ఏడుస్తున్నారు కానీ...నాకు తెలిసి అత్యధిక సంఖ్యలో జర్నలిస్టులు ఇలాంటి లాబీ వ్యవహారాలు చేస్తూ...తాము పనిచేసే సంస్థకో, తమకో లాభం కలిగేలా చూసుకుంటారు. గాస్ సిలిండర్ సైతం పైరవీతో కాకుండా...క్యూలో నిల్చుని తెచ్చుకోవాలని అనుకునే నాలాంటి వాళ్ళను ఇదే జర్నలిస్టులు....పిచ్చి నాయాళ్ళుగా, పనికిరాని వెధవలుగా చూస్తారు. లాబీ చేసుకోవడం మహాపాపం అనీ, అది ఇతరుల పొట్టకొట్టడం లాంటిదని, నిజంగా అర్హత ఉంటే మనల్ని విజయం వరిస్తుందని గట్టిగా నమ్మి ఈ మధ్య రెండు ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలలో ఒక అసిస్టంట్ లెక్చరర్ పోస్టు, ఒక రీడర్ పోస్టు చేజేతులా పోగొట్టుకున్నాను. అక్కడి లాబీ తతంగాలు చూస్తే...నిర్వేదం, నిస్తేజం కలిగాయి. 'నీ బొంద మీది నీతి! ఒక్క సారి వచ్చి మంత్రిని కలువు. లేకపోతే పనికాదు,' అని అంతకుముందే ఒక మిత్రుడు ఇచ్చిన సలహాను పాటించక తప్పుచేసానో, నీతిని నమ్ముకుని మంచి చేసానో నాకు ఇంకా బోధపడలేదు. డబ్బు, మందు, పొందు, పొగడ్తలు...వంటి మత్తుమందులు చల్లితేనే ఇక్కడ పనులవుతాయి. అది మీలో చాలా మందికి ఈ పాటికే అనుభవంలోకి వచ్చి వుంటుంది. కాకపోతే....కాస్త పాష్ సమాజంలో ఉండేవాళ్ళం కాబట్టి వీటిని బైటికి చెప్పుకోం మనం.

అంతదాకా ఎందుకు? మీకు అందుబాటులో వున్న 'ఈనాడు' లేదా 'ఆంధ్రజ్యోతి' విలేకరులతో మాట్లాడండి. వారితో వారి యాజమాన్యాలు ఎలా పనులు చేయిన్చుకున్నాయో చెబుతారు. అన్ని పత్రికలు నేతలను, పోలీసులను, అధికారులను అడ్డంపెట్టుకుని ప్రతి జిల్లా కేంద్రంలో ఛీప్ రేటుకు పెద్ద మొత్తంలో స్థలాలు కొన్నాయి. ఒక రామోజీ, ఒక రాధాక్రిష్ణ లాబీయింగ్ చేయకుండానే ఈ స్థాయికి వచ్చారా? ఆగస్టు సంక్షోభం ఒక పెద్ద మీడియా-పొలిటికల్ లాబీయింగ్ లో భాగం కాదా? పుష్కరాల కవరేజ్ కు కూడా మీడియా లాబీయింగ్ చేసిన ఘనత చంద్రబాబు గారిది. ఎన్.డీ.-టీ.వీ.యాజమాన్యానికి, ప్రనోయ్ రాయ్ కు తెలీకుండా ఇదంతా జరిగిందని అనుకోవడం ఒక పిచ్చితనం. ఇక్కడ దొరికినోడు మాత్రమే దొంగ సార్.

నాకు తెలిసి...ప్రతి విలేకరి తమ సంస్థ కోసం పైరవి చేస్తాడు. నేను....అలా చేసే వాడిని కాదు...అన్న పిచ్చి మారాజులు ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అలాంటి వాడికి చెత్త బీట్ దొరుకుతుంది. పనికిరానివాడన్న ముద్ర బోనస్ గా లభిస్తుంది. విలేకరులు అంతా....వ్యాపార ప్రకటనల కోసం గడ్డి కరుస్తూ...లాబీ చక్రవలయంలో చిక్కుకుంటున్నారు. రాజకీయ తీట వున్న తాను ఇచ్చే ప్రకటన, ఫోటో పత్రికలో వేసి మర్నాడు...ఒక పచ్చ గాంధీ (ఐదొందలు) కోసం తన దగ్గరకు వచ్చే విలేకరుల గురించి ఒక న్యాయవాది చెబితే మొదట్లో నేను ఆశ్చర్యపోయాను. యాజమాన్యాలు సరిగా డబ్బులివ్వవు, మన లాయర్ లాంటి వాళ్ళు వ్యవస్థను కరప్ట్ చేస్తారు, ఈ కక్కుర్తిగాళ్ళు (విలేకరులు) గడ్డి తింటారు. ఇక్కడ మేత బాగుందని గ్రహించి...వేరే పనిచేసుకునే దొంగ వెధవలు కూడా విలేకరులు, విశ్లేషకులు, మేథావుల అవతారాలు ఎత్తి జర్నలిజాన్ని మరీ పలచన చేస్తారు.

నిజానికి జిల్లాల్లో విలేకరులు చాలా మంది ఏదో ఒక రాజకీయవేత్తకు బంటుగా పనిచేస్తారు. ఆ దన్నుతో అధికారులను బెదిరించి దండుకుంటారు. అయినా...పత్రికలు, ఛానెల్స్ పార్టీల వారీగా చీలిపోయినప్పుడు, ప్రకటనల కోసం విలేకరులకు టార్గెట్ లు ఉన్నప్పుడు....ఇంకా జర్నలిజంలో విలువలు ఉంటాయని అనుకోవడం ఒక భ్రమ, దురాశ. దురదృష్టవశాత్తూ మన దగ్గర జర్నలిస్టు యూనియన్ నేతలు కూడా మాంచి లాబీయిస్టులు. వారిని నమ్ముకోకపోతే....తర్వాత ప్రెస్ అకాడమీ ఛైర్మన్ వంటి పదవులకు లాబీయింగ్ కష్టమవుతుందని మన ఎడిటర్లు భావించాల్సిన పరిస్థితి. కాబట్టి....గొంగట్లో అన్నం తింటూ వెంట్రుకలు ఏరుకోవడం దేనికి? కుళ్ళి కంపుకొడుతున్న వ్యవస్థను బాగుచేయడానికి దివి నుంచి భువికేగిన వ్యవస్థ...ఈ మీడియా అనుకోవడం దేనికి?
Add starShareShare with noteKeep unread

    'రాడియా గేటు' పై టీవీ చర్చల్లో లాబీయిస్టులకు పెద్దపీట

    వైష్ణవి కమ్యూనికేషన్స్ అధినేత్రి, కార్పోరేట్ లాబీయిస్ట్ నీరా రాడియా...ప్రసిద్ధ జర్నలిస్టులు బర్ఖాదత్, వీర్ సంఘ్వి లతో తెరవెనుక నడిపిన మంత్రాంగం విషయంలో తెలుగు టెలివిజన్ చానెళ్ళు చేస్తున్న చర్చలు చూస్తే బాధ కలుగుతున్నది.

    తెలుగు జర్నలిజాన్ని బాహాటంగా అమ్ముకుని బాగా సంపాదించిన వారిని, యూనియన్ను అడ్డం పెట్టుకుని అడ్డదిడ్డంగా పదవులు, ఆస్తులు సంపాదించిన వారిని, జర్నలిజంలో నైతిక విలువలు పూర్తిగా నాశనం కావడానికి కారణమైన వారిని చర్చలకు పిలుస్తున్నారు. ఇది అభ్యంతరకరం, దారుణం, ప్రజలను మోసం చేయడం. పొట్టకోస్తే అక్షరం ముక్క బైటపడని ఈ పండితులు...టీ.వీ.స్టూడియోలలో కూర్చుని జర్నలిజం విలువల గురించి మాట్లాడుతున్నారు. ఎన్నో చిలకపలుకులు పలుకుతున్నారు.

    అధికారంలో ఎవరుంటే...వారి భజన చేసి నాలుగు రాళ్ళు వెనుక వేసుకుని, తమ్ములకు అన్నలకు అత్తమామలకు మేళ్ళు చేసే ఈ బ్యాచు రాడియా ఉదంతం పై తీర్పులు చెబుతుంటే...అసహ్యం వేస్తోంది. ఈ బాపతు గాళ్ళు సచివాలయంలోపల, వెలుపల ఎలాంటి లాబీయింగ్ చేసి ఎంత సంపాదిస్తారో సీనియర్ జర్నలిస్టులను ఎవరిని అడిగినా చెబుతారు. సీనియర్ ఎడిటర్లు...దయచేసి చర్చలకైనా నికార్సైన నిజాయితీపరులైన జర్నలిస్టులను పిలిస్తే బాగుంటుంది.

    Sunday, September 19, 2010

    ఈ దొరయేందిరో !



    తుది దశకు చేరుకున్న తెలంగాణ ఉద్యమాన్ని కులాల వారీగా చీల్చి తన అగ్రకుల దురహంకార మాయోపాయాన్ని తమపై ప్రయోగిస్తున్న టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ కుల రాజకీయంపై తెలంగాణ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులు కన్నెర్ర చేస్తున్నారు. కేసీఆర్‌ తెచ్చే వెలమ-రెడ్ల తెలంగాణ తమకు అవసరం లేదని, అగ్రవర్ణాలు లేని.. బడుగు బలహీన వర్గాలతో కూడిన సామాజిక తెలంగాణ మాత్రమే కావాలంటూ పిడిి లి బిగించనున్నారు. విద్యార్థుల ఉద్యమాన్ని టీఆస్‌ఎస్‌కు తాకట్టు పెట్టి, వారికి తొత్తులుగా మార్చుకునే కేసీఆర్‌ కుల రాజకీయాన్ని తిప్పికొట్టి, అన్ని రాజకీయ పార్టీల సహకారంతో తామే ముందుండి తెలంగాణ సాధించుకోవాలని బడుగు వర్గాలకు చెందిన విద్యార్థులు నిర్ణయించుకున్నారు.

    మరోవైపు కేసీఆర్‌కు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు కార్యాచరణ సిద్ధమయింది.అగ్రకులాల రాజకీయ ప్రయోగశాలగా మారిన ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని కాపాడుకోవడంతో పాటు, కేసీఆర్‌ పడగ నీడ నుంచి రక్షించాలన్న లక్ష్యంతో ఇకపై అడుగులు వేయాలని నిర్ణయించారు. శుక్రవారం నిర్వహించిన ఆత్మగౌరవ సభలో దళిత నేత విశారదన్‌ ప్రసంగాన్ని అక్కడే ఉన్న ప్రొఫెసర్‌ కోదండరామిరెడ్డి సూచనలతో అడ్డుకున్న వైనం బడుగు వర్గాల విద్యార్థి లోకంలో ఆగ్రహానికి దారితీసింది. ఈ పరిణామం.. కేసీఆర్‌ చేతిలో ఓయూ విద్యార్థి సంఘాలు చిక్కుకున్నాయన్న వాస్తవాన్ని గ్రహించిన బడుగు వర్గాలు, తమ ఆత్మగౌరవాన్ని పరిరక్షించుకునేందుకు రంగంలోకి దిగాయి.

    ఆత్మగౌరవ సభలో తమకు జరిగిన అన్యాయానికి కేసీఆరే కారణమంటూ శనివారం బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థి నేతలు ఉస్మానియాలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించి, కేసీఆర్‌ దిష్టిబొమ్మ దగ్థం చేశారు. ఆయనపై కేసు నమోదు చేశారు. ఇది ఓయూలోని బడుగు వర్గాలకు విద్యార్థుల్లో కేసీఆర్‌ చేస్తున్న కుల రాజకీయాలపై ఉన్న ఆగ్రహానికి నిదర్శనంగా నిలిచింది. ఆయనపై తిరుగుబాటు చేసేందుకు బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు సన్నద్ధమవుతున్నారు. ఆ మేరకు వారు శుక్రవారం రాత్రి జరిగిన సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం.

    బడుగు బలహీన వర్గాల ఆత్మత్యాగాలతోనే తెలంగాణ ఉద్యమం చివరి అంకానికి చేరిందని, అయితే కేసీఆర్‌ దానిని వెలమ-రెడ్లకు అంకితం చేసేందుకు ఉద్యమంలో పాల్గొంటున్న తమ మధ్య చీలికలు తెచ్చి రాజకీయ ప్రయోజనాలు సాధించుకునే ఎత్తుగడను తిప్పికొట్టి కేసీఆర్‌ నుంచి తెలంగాణను రక్షించుకోవాలని బడుగు బలహీన వర్గాల విద్యార్థి జేఏసీ నేతలు నిర్ణయించుకున్నారు.కేసీఆర్‌ తన తొత్తులను తమలో చొప్పించి ఉద్యమాన్ని కులాల వారీగాచీలుస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వారిని అన్ని విధాలుగా ప్రలోభపరుచుకుని, తమ ఉద్యమాన్ని చివరకు టీఆర్‌ఎస్‌కు తాకట్టు పెట్టే దిశగా తీసుకువెళుతున్నందున, ఇకపై తాము కేసీఆర్‌ ఉచ్చులో చిక్కకూడదని బడుగు జేఏసీ నేతలు తీర్మానించు కున్నారు. తమ వర్గాలకే చెందిన కొందరు నేతలు ఇప్పటికే కేసీఆర్‌ ప్రలోభాలకు చిక్కినందున, అగ్రవర్ణాలతో పాటు వారిని కూడా దూరం పెట్టి బడుగు బలహీన వర్గాల విద్యార్థులతో ఉద్యమాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించుకున్నారు.

    తమ త్యాగాలు, ఆత్మ బలిదానాలతో తుది దశకు చేరిన ఉద్యమం ఫలించాలంటే తమకు అన్ని రాజకీయ పార్టీల అండ కావాలని, అందుకోసం ప్రతి ఒక్క రాజకీయ పార్టీ మద్దతు కోరాలని నిర్ణయించుకున్నారు.టీఆర్‌ఎస్‌ చేతిలో కీలుబొమ్మలుగా ఉన్న కొన్ని విద్యార్థి సంఘాలు మిగిలిన రాజకీయ పార్టీలను అడ్డుకుని, మొత్తం విద్యార్థులను కేసీఆ ర్‌ మద్దతుదారులుగా మార్చే ప్రయత్నా లను తిప్పికొట్టాలని పిలుపునివ్వనున్నా రు. బడుగు బలహీన వర్గాల ద్వారా ప్రారంభమయిన ఉద్యమాన్ని హైజాక్‌ చేసి, దానిని ఒక్క శాతం కూడా లేని వెలమదొరలకు అంకితం చేసేందుకు కేసీఆర్‌ చేస్తున్న రాజకీయ కుట్రను సమర్థవంతంగా, సమిష్ఠిగా తిప్పికొడతా మని ఓయూ బీసి జేఏసీ కన్వీనర్‌ వి. రామారావు గౌడ్‌ స్పష్టం చేశారు.

    విద్యార్థి ఉద్యమంలో చొరబడ్డ టీఆర్‌ఎస్‌ను దూరం చేయకపోతే మిగిలిన పార్టీలు దరికి చేరవని గుర్తించిన బడుగు వర్గాల విద్యార్థి సంఘాలు, మిగిలిన పార్టీల మద్దతు కోరేందుకు సిద్ధమవుతున్నాయి.నాయకులను అడ్డకుంటున్నది ఒక్క టీఆర్‌ఎస్‌కు మద్దతునిచ్చే సంఘాలే తప్ప, విద్యార్థులంతా కాదని వారికి స్పష్టం చేయనున్నారు. కేసీఆర్‌ అగ్రకుల రాజకీయం, మీడియా వల్ల పెద్ద నేతలుగా ఎదిగిన తమ వర్గ నేతలు కొందరు కేసీఆర్‌ను తాము విమర్శిస్తుంటే అడ్డుకుంటూ, దొరలకు ఊడిగం చేస్తున్నందున.. అలాంటి వారిని ఇకపై నాయకులుగా గుర్తించ వద్దని పిలుపునిచ్చేందుకు తీర్మానించారు. ‘దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన మైక్రోఫైనాన్స్‌ కేసులో పెద్ద లీడరుగా చెలామణి అవుతున్న ఓ నేత 3 లక్షలు తీసుకున్నాడు. కేసీఆర్‌కు భజన చేయడం, ఆయన నుంచి లబ్థి పొందడమే వారి రోజు వారీ కార్యక్రమం. ఇది ఓయూలో అందరికీ తెలిసిన సత్యం. అలాంటి వాళ్లు చేసే ఉద్యమాలకు విశ్వసనీయత ఉంటుందా’ అని ఓ బీసీ విద్యార్థి సంఘ నేత ప్రశ్నించారు.

    కొందరు నాయకుల తీరు, వ్యవహారశైలి వల్ల మొత్తం ఓయూ విద్యార్థులను దోషులుగా చూస్తున్నారని, అన్నింటికన్నా ప్రధానంగా విద్యార్థులందరినీ టీఆర్‌ఎస్‌ సానుభూతిపరులుగా, కార్యకర్తలుగా చూపించేందుకు కేసీఆర్‌, ఆయనకు తందానా పలుకుతున్న నేతల ప్రయత్నాలను అడ్డుకోవడం చారిత్రక అవసరంగా గుర్తిస్తున్నారు. లేకపోతే భవిష్యత్తులో విద్యార్థులకు ఆత్మగౌరవం అనేది లేకుండా పోతుందని భావిస్తున్నారు.విద్యార్థి ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని వారితో ఆరున్నర లక్షల సభ్యత్వాలు కేసీఆర్‌ చేయిస్తే, దానికి కారణమయిన విద్యార్థి నేతలు మాత్రం ఇంకా ఆయన చుట్టూ తిరుగుతున్న విషాద పరిస్థితిని తోటి విద్యార్థులకు వివరించేందుకు త్వరలో ఒక సభ నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిసింది.

    కేసీఆర్‌ను దూరం పెట్టాలి
    ramaraoతనకు తొత్తులుగా మారని విద్యార్థి సంఘాల నేతలపై కేసీఆర్‌ అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఓయూ జేఏసీ కన్వీనర్‌ రామారావు ఆరోపించారు. కొన్ని విద్యార్థి సంఘాలు కేసీఆర్‌ ప్రలోభానికి లోనయ్యాయని, వారిని విద్యార్థులే దూరం పెట్టాలని పిలుపునిచ్చారు. దళితుడికి సీఎం, మైనారిటీకి డిప్యూటీ సీఎం ఇస్తానన్న కేసీఆర్‌కు తెలంగాణ జనాభాలో 65 శాతం ఉన్న బీసీలు ఆ పదవులకు అర్హులుగా కనిపించలేదా అని ప్రశ్నించారు. అగ్రవర్ణ-దొరల తెలంగా ణకు వ్యతిరేకంగా జరిగే పునరేకీకరణ ఉద్యమంలో తామూ భాగస్వాము లవుతామన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలతో మొదలయిన విద్యార్థి ఉద్యమాన్ని కేసీఆర్‌ చీల్చి, వారి మధ్య శత్రుత్వాన్ని రగిలించారని ఆరోపించారు. ఆరోపించారు.

    కేసీఆర్‌ అగ్రకుల దురంహంకారి
    Arvind-Kumar-Goudకేసీఆర్‌ అగ్రకుల దురహంకారి అని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. అరవిందకుమార్‌ గౌడ్‌ ధ్వజమెత్తారు. దళితుడితో చెప్పులు తొడిగించుకున్న కేసీఆర్‌ రేపు తెలంగాణ వస్తే దళితుల ఆత్మగౌరవాన్ని ఇంకెంత దెబ్బతీస్తారో గమనించాలని పిలుపునిచ్చారు. దళిత విద్యార్థి విశారదన్‌ను అవమానించిన టీఆర్‌ఎస్‌ అగ్రకుల వైఖరిని దళితులు, బీసీలు ఇప్పటికయినా గ్రహించాలని కోరారు. ఎన్టీఆర్‌, చంద్రబాబునాయుడు మాత్రమే తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు గుర్తింపు ఇచ్చారన్న వాస్తవాన్ని విస్మరిం చకూడదన్నారు. చంద్రబాబునాయుడు దళితులకు లోక్‌సభ, అసెంబ్లీ స్పీకర్‌, బీసీలకు అసెంబ్లీ స్పీకర్‌, హోం, రెవిన్యూ, ఆర్ధికమంత్రి వంటి శక్తివంతమైన పదవులు ఇస్తే.. కేసీఆర్‌ మాత్రం దళితులతో చెప్పులు తొడిగించుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణ దళితుడికి సీఎం పదవి ఇస్తానన్న కేసీఆర్‌.. నిజంగా దళితుడికి ఆ పదవి ఇస్తే అప్పుడు ఇంకెంత దారుణంగా అవమానిస్తారో ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచించాలని గౌడ్‌ పిలుపునిచ్చారు.

    కేసీఆర్‌కు ప్రత్యామ్నాయంగా మారుతాం
    visharadhan‘ఇప్పటికే ఓయూలో కొన్ని విద్యార్థి సంఘాలు టీఆర్‌ఎస్‌కు తొత్తుగా మారాయన్న అభిప్రాయం, అప్రతిష్ఠ జనంలో బలంగా నాటుకుపోయింది. అందువల్ల మిగిలిన పార్టీలు మాకు కంటితుడుపు మద్దతు తప్ప, మనస్ఫూర్తిగా మద్దతునిచ్చేందుకు ముందుకురావడం లేదని గ్రహించాం. ఈ పరిస్థితిలో కచ్చితంగా మార్పు తీసుకువస్తాం. విద్యార్థుల ఆత్మగౌరవంతో నడిపే ఉద్యమానికి అన్ని పార్టీల మద్దతు అవసరం. ఆత్మగౌరవమంటే శక్తి. ఆ శక్తిని నిర్వీర్యం చేయడమే కేసీఆర్‌ లక్ష్యం. మా ఉద్యమంలో చీలికలు తెచ్చిన కేసీఆర్‌ను మేం కూడా రాజకీయంగానే ఎదుర్కొంటాం. అంటే మేమే రాజకీయాల్లోకి వచ్చి కేసీఆర్‌కు ప్రత్యామ్నాయంగా మారతాం. అప్పుడే తెలంగాణ సిద్ధిస్తుంద’ని ఓయూకు చెందిన దళిత శక్తి రాష్ట్ర కన్వీనర్‌ విశారదన్‌ స్పష్టం చేశారు.

    కేసీఆర్‌ బీసీల వ్యతిరేకి : జయప్రసాద్‌
    కేసీఆర్‌ పచ్చి బీసీ వ్యతిరేకి అని, ఆయన ఉద్యమాన్ని నడిపించినంత కాలం తెలంగాణ రావడం అసాధ్యమని సామాజిక తెలంగాణ ఓబీసీ జేఏసీ కన్వీనర్‌ కె.జయప్రసాద్‌ స్పష్టం చేశారు. ఓయూలో దళిత విద్యార్థి నేత విశారదన్‌ను ప్రసంగం మధ్యలోనే అడ్డుకోవడం, దానిని కోదండరామిరెడ్డి దగ్గరుండి మరీ ప్రోత్సహించడం బట్టి.. దొరల తెలంగాణ కోసం కేసీఆర్‌ ఎంత నీచానికి పాల్పడుతున్నారో స్పష్టమవుతోందన్నారు. ఓయూ విద్యార్థులంతా తన చెప్పుచేతల్లో ఉండాలని కోరుకుంటున్నందున.. బడుగు బలహీన వర్గాల విద్యార్థులు కేసీఆర్‌ వలలో చిక్కుకోవద్దన్నారు. కేసీఆర్‌ కేవలం వెలమ-రెడ్ల కోసమే ఉద్యమాలు చేస్తున్నారని ఆరోపించారు.

    Sunday, August 1, 2010

    "Best friends need not be physically present, each keep the other company in the hearts."

    HAPPY FRIENDSHIP DAY

    Friday, July 16, 2010

    సోంపేట మృతులకు అశ్రునివాళి!


    అమాయక ప్రజలను బలిగొన్న రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగ మెతక వైఖరిని నిరసిస్తూ సోంపేట ఆందోళనలో అసువులు బాసిన మృతులకు అంజలి ఘటిస్తూ...

    Wednesday, May 12, 2010

    రాయపాటి వర్సెస్ కన్నా!

    గుంటూరు లో కన్నా లక్ష్మి నారాయణ , రాయపాటి సాంబశివరావు ల మధ్య జరుగుతున్న అంతర్యుద్దం నేడు బహిర్గతమయ్యి చిలికి చిలికి పెను తుఫాను గా మారింది నేడు అది రెండు కులాల మధ్య చిచ్చుగా మారింది. ఈ వేడి రాష్ట్రం దాటి కేంద్రానికి పాకింది. గత కొన్ని దశాబ్దాలుగా గుంటూరు జిల్లాను తమ సొంత జాగీరు గా మార్చుకున్న రాయపాటి ఫ్యామిలీకి కన్నా లక్ష్మి నారాయణ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై ఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్య అనుచరుడుగా పదవిని సాధించడమే కాక గుంటూరు జిల్లాలో తనకంటూ ఒక సొంత వర్గాన్ని ఏర్పరుచుకుని తదనుగుణంగా కార్యక్రమాలను నిర్వహించడం రాయపాటి వర్గానికి పచ్చి వెలక్కాయ గొంతులో పడ్డట్టు అయింది. ఇప్పటి వరకు ఆ వర్గం ఆడింది ఆటగా, పాడింది పాటగా సాగింది. ఇప్పుడు కన్నా వర్గం క్రమేనా బలపడటం తో ప్రజలలో రాయపాటి వర్గానికి చుక్కెదురైంది. గతం లో కూడా రాయపాటి వర్గీయులు చేసిన ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయేది. జయ లక్ష్మి టొబాకో ని అడ్డం పెట్తుకుని ఎంతమంది పుగాకు రైతులను ముంచింది స్తానికులందరికి తెలిసిన విషయమే. ఇదే వ్యాపారాన్ని అడ్డం పెట్తుకుని స్వర్గీయ ఇందిరా గాంధీ మొదలుకుని దివంగత రాజీవ్ గాంధీ ప్రధాన మంత్రి గా ఉన్నంత కాలం కేంద్ర పుగాకు బోర్డులో అధ్యక్ష పదవి నుండి వివిధ హోదాలలో పదవులు సంపాదించి వాటి ఆ పరపతి తో తన పుగాకు సామ్రాజ్యాన్ని అంతర్జాతీయ స్థాయి లో విస్తరించున్న ఘరానా వ్యక్తి రాయపాటి. ఇతర దేశాలకు పుగాకు ఎగుమతి చేసేందుకు అవసరమైన పుగాకును జిల్లాలోని బక్క రైతుల వద్దనుండి అతి తక్కువ ధరకు పుగాకును కొనుగోలు చేసి ఎందరో రైతులు రోడ్డున పడటానికి కారణమైన మహా ఘనుడు గౌరవ రాయపాటి. అంతేకాకుండా తన పదవులను, పనులను నిరాటంకంగా కొనసాగించేందుకు అడ్డం వచ్చినవారిని సామ, దాన, భేద, దండోపాయాలతో లొంగ దీసుకునేందుకు అడ్డగా రాయపాటి వారి జయలక్ష్మి గెస్ట్ హవుస్ అన్నడి జగమెరిగిన సత్యం. బహుశా ఇందులోని ప్రతి గోడకు చెవులుంటే అవి చెప్పగలవు రాయపాటి వారి రస లీలలు, అరాచక ఆగడాలను. ఇక వీరి వికృత అరాచక చేష్టలు ఇక్కడితో ఆగితే బాగానే వుండేది కాని మన ఆంధ్రులను అపఖ్యాతి పాలుచేసిన ఘనత కూడా రాయపాటిదే అని చెప్పుకోవచ్చు. అంతర్జాతీయ పుగాకు విపణిలో సైతం తన దగా కోరు తనాన్ని చాటుకున్న పెద్దమనిషి ఈ రాయపాటే. చైనా లో ని కొందరు అధికారులకు ధనాశ చూపి పుగాకు బ్యారేల్స్ లో పుగాకు తో పాటు ఇతర వ్యర్ధపదార్ధాలను కూర్చి ఎగుమతి చేసిన ఘరానా దొంగ. అప్పట్లో వీరి పుణ్యమాని చైనాలో ఈ విధమైన మోసాలకు పాల్పడి నందులకు అక్కడ షుమారు ముప్పై తొమ్మిది మంది ఉద్యోగస్తులను చైనా ప్రభుత్వం అతి దారుణమైన శిక్షలకు గురి చేసి నట్లు వదంతి. ఇంతటి ఘనమైన చరిత్ర కలిగినరాయపాటి అంతటి తో ఆగకుండా నేడు తన కుటుంబ సభ్యులన్దరిని రాజకీయాల్లోచొప్పించి వివిధ అధికార పదవులలో కూర్చో పెట్టడమే కాకుండా తన పర భేదం లేకుండా ఖాళీ గా వున్న ప్రభుత్వ స్తలాలనే కాకుండా, ఇతర మతస్తుల సొంత స్తాలాలను ఆక్రమించుకోవడం లో కూడా అగ్రగన్యులే. చెప్పుకుంటూ పొతే రాయపాటి చరిత్ర ఒక మహోద్గ్రన్ధమే. ఇంతటి ఘన చరిత్ర కలిగిన రాయపాటి నేడు కన్నని విమర్శించడం హాస్యాస్పదం అనిపించుకుంటుంది. అది చాలదన్నట్లు అన్నదమ్ముల్ల కలిసి ఉంటున్న ఇరు కులాల వారిని రెచ్చగొట్టి తన పబ్బం గడుపుకోవాలను కోవడ అతని నీచ సంస్కృతీ కి మరో తార్కాణం. ఇప్పటికైనా రాయపాటి తన నీచ రాజకీయాలను వీడక పొతే, అతని నిజ స్వరూపం బట్టబయలు కాకా తప్పదు. ఆ రోజు ఎంతో దూరం లేదన్న వాస్తవాన్ని గుర్తిస్తే మంచిది. ఆకాశ మీద వుమ్మలను కోవడం అవివేకమన్న సత్యాన్ని ఇప్పటికైనా గుర్తెరిగి ప్రవర్తిస్తే అన్ని విధాల రాయపాటికి శ్రేయస్కరం.

    చిరు 'సందడి'

    Tuesday, May 11, 2010

    రాజకీయ రాబందులు రేపిన చిచ్చు ఇది!


    మన తెలుగుభూమి యొక్క ఆధికారికస్వరూపం ఇంతకంటే పెద్దదైతే దీన్ని రెండు రాష్ట్రాలుగానే కాదు, నాలుగు రాష్ట్రాలుగా విభజించడానిక్కూడా నేను సమ్మతించి ఉందునేమో ! అంటే - మొదట మధ్యప్రదేశ్‌లోను, ఆ తరువాత ఛత్తీస్‌గఢ్‌లోను కలిసిపోయిన దంతివాడ, బిజాపూర్, బస్తర్ జిల్లాలు తెలంగాణలో భాగమై ఉంటే, కర్ణాటకలోను, తమిళనాడులోను కలిసిపోయిన బళ్ళారి, కోలారు, కృష్ణగిరి, ధర్మపురి జిల్లాలు రాయలసీమలో భాగమై ఉంటే, మద్రాసు, చెంగల్పట్టు, కోరాపుట్టి, గంజాం, బరంపురం జిల్లాలు కోస్తాలో భాగమై ఉంటే, ఆ విధంగా ఇది ఇరాక్, జర్మనీల స్థాయిలో మూడులక్షల ముప్ఫైవేల చదరపు కిలోమీటర్ల కంటే పెద్దదై ఉంటే, మనవాళ్ళు తమ ఆత్మగౌరవాన్ని తోటి తెలుగువాళ్ళ మీద కాకుండా ఇతరుల మీద ప్రదర్శించగలిగిన నాగరికతా పరిణామస్థాయికి ఎదిగుంటే- మనం ఉన్న సెటప్పులో ఇంత పెద్ద భూభాగం ఒక దేశం అనిపించుకుంటుంది తప్ప రాష్ట్రం అనిపించుకోదు కనుక, విభజనకి నేను పునరాలోచన లేకుండా సమ్మతించి ఉందును.

    కానీ వాస్తవ పరిస్థితి అలా లేదు. మనం ఇప్పటికే ఒక దెబ్బదిన్న జాతి. ఆనాటి కాంగ్రెస్ చేతుల్లో మెడలు వంచబడ్డ జాతి. మనవాళ్ళు ఆరోజుల్లో కాంగ్రెస్ అధిష్ఠానానికి డూడూబసవన్నలై చూపిన వీరవిధేయతలకి ప్రతిఫలంగా మనకు నెహ్రూ ఇచ్చినదే ఒక ముక్కలు-చెక్కల తెలుగురాష్ట్రం. సుమారు ముప్ఫైమూడు శాతం జిల్లాల్ని పోగొట్టుకుని కేవలం అఱవయ్యాఱు శాతం జిల్లాలతో ఏర్పడ్డ అసమగ్ర, వికలాంగరాష్ట్రం. ఇది ఇప్పటికే చిన్న రాష్ట్రం. నిధుల కేటాయింపులో తమిళనాడు మీద చూపుతూ వచ్చిన ప్రేమని కేంద్రప్రభుత్వం మనమీద చూపకపోవడం వల్ల ఆర్థికంగా ఇంకా కుదేలైపోయాం. దీన్ని ఇంకా ఇంకా ముక్కలు చేసినందువల్ల ప్రయోజనం ఏముంది ? ఇవి పూర్వంలాగే వేఱువేఱు ప్రభుత్వాల ఏల్బడిలోకి వెళ్ళి అక్కడ తెలుగేతర మైనారిటీల సంఖ్య హైదరాబాదులో మాదిరి పెఱిగిపోయి ఆత్మగౌరవ విటమిన్ లోపంతో బాధపడే తెలుగువాళ్ళకి ఇంకా ఇంకా ఎక్కువ అన్యాయాలు జఱుగుతాయే తప్ప మేలేమీ జఱగదు. ఉదాహరణకి ఉత్తరాంధ్ర అని చెప్పబడుతున్న ప్రాంతం అంతా కలిపితే వైశాల్యంలో అనంతపురం జిల్లాకి కాస్త అటూ-ఇటూగా ఉంటుంది. దాన్నొక ప్రత్యేకరాష్ట్రంగా చేస్తే అక్కడ ఒరియా, ఇంకా తతిమ్మా ఉత్తరాదిప్రజల ప్రాబల్యం పెఱిగిపోతుంది. ప్రతిచోటా అదే కథ ఇంకో రూపంలో పునరావృత్తం కావచ్చు. గతంలో ఇటువంటివి జఱిగాయి (నిజాం హయాములో తెలంగాణలో మరాఠీల ప్రాబల్యం) కనుకనే అనైక్యత తెలుగుజాతికి శాపమని భావించిన మన పూర్వీకులు ఉద్దేశపూర్వకంగా ఉన్నంతలోనే పెద్దరాష్టాన్ని ఏర్పఱిచారు. ఆ రకంగా వారు మన చేతిలో ఒక పెద్ద, శక్తిమంతమైన వజ్రాయుధాన్ని పెట్టివెళ్ళారు. వాడుకోవడం చేతకాక మనం దాన్ని అవతల పారేస్తున్నాం.

    తెలుగుభూమిని ఇలా ముక్కలు చెక్కలు చేసి రాష్ట్రం ఇవ్వడానికి నెహ్రూ కారణాలు నెహ్రూకున్నాయి. వాటిల్లో నిమిత్తకారణం (immediate cause) గా చెప్పుకోదగ్గది - ఆయన గుంటూరు పర్యటనకొచ్చినప్పుడు "ఆంధ్రరాష్ట్రం ఇస్తావా ? లేదా ?" అని గుంటూరువాళ్ళు ఆయన మీద ఱాళ్ళవర్షం, చెప్పుల వర్షం కుఱిపించడం. నెహ్రూ అహం దెబ్బదిన్నది. దేశమంతటా గౌరవించబడే తనకు తెలుగువాళ్ళు చేసిన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలనే కక్షతో నిలువునా రగిలిపోయాడు. అసలు అక్కడిక్కడే అనేశాడు కూడా, "మీ తెలుగువాళ్ళకి చాలా పొగరు" అని ! ఆ తరువాత విశాలాంధ్ర ప్రతిపాదనలతో రాష్ట్రనాయకులు నెహ్రూని సమీపించినప్పుడు "విశాలాంధ్ర అనే పదం సామ్రాజ్యవాదాన్ని సూచిస్తున్నది" అని నెహ్రూ వ్యాఖ్యానించడం వెనుక ఉన్నది ఈ పరాభవభారమే. ఇదొక పెద్ద జోక్. ఒకడి ముక్కూమొహం ఏంటో ఇంకొకడికి తెలియనివాళ్లూ, ఏ విషయంలోనూ ఇసుమంత పోలిక కూడా లేనివాళ్ళూ, విసిరేసినట్లు ఎక్కడెక్కడో నివసించేవాళ్లూ అంతా కలిసి కాశ్మీరం నుంచి కన్యాకుమారి దాకా ఇండియా పేరుతో ఒకే రాజ్యంగా ఉండాలని తాను కోరుకుంటే అది సామ్రాజ్యవాదం కాదట. కానీ ఒకే మతానికీ, భాషకీ, జాతికీ చెంది, ఒకే సాంస్కృతిక వారసత్వం గల తెలుగుప్రజలు స్వచ్ఛందంగా సమైక్యంగా ఉండాలని అభిలషిస్తే మటుకు అది సామ్రాజ్యవాదమట. ఒక ముక్కలో చెప్పాలంటే హిందీవాళ్ళ సామ్రాజ్యవాదానికి జాతీయవాదం అని పేరుపెట్టాడు. ఇతరుల జాతీయతాభావనకేమో సామ్రాజ్యవాదమని పేరుపెట్టాడు. హిందీ రాష్ట్రాలని చెప్పబడుతున్నవాటిల్లో హిందీ మాట్లాడని ప్రజలే ఎక్కువ. కానీ వాళ్ళందఱి నెత్తినా బలవంతంగా హిందీని రుద్దారు.

    ఒక పెద్దజాతిని అలాగే పెద్దజాతిగా కొనసాగనివ్వడం తమకి ప్రమాదమనుకున్న నెహ్రూ, సి. రాజగోపాలాచారి (భారతదేశపు చిట్టచివఱి గవర్నర్ జెనరల్) లాంటివాళ్ళని మనవాళ్ళు మహనీయులుగా, జాతీయనాయకులుగా, తమ భాగ్యవిధాతలుగా, శ్రేయోఽభిలాషులుగా భ్రమిస్తూ వాళ్ళ ఆదేశాలకి తలొగ్గుతూ, అత్యంత నమ్మకంగా తమ జీవితాల్ని తీసుకెళ్ళి వాళ్ల చేతుల్లో పెట్టినందుకు వాళ్లు మనకి చేసిన ఉపకారం - మనల్ని అడుగడుగునా ముక్కలు చెక్కలు చేసి ఆనందించడం. తెలుగుభూమిని నలువైపులా క్రాపింగ్ చేసి శాశ్వతంగా తొక్కేయడం. స్వాతంత్ర్యం వచ్చినాక ఏర్పడ్డ మొదటి భాషారాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అయితే ఏ విషయంలోనైనా ఆద్యులైనవాళ్లు (pioneers) చాలా కష్టాలు పడతారంటారు. బహుశా నిజమే కావచ్చు. మన తరువాత మనల్ని చూసి చాలా భాషారాష్ట్రాలేర్పడ్డాయి. వాస్తవానికి మనల్ని చూసి భాషాదేశాలే ఏర్పడ్డాయని చెప్పుకోవచ్చు. కానీ భూభాగం విషయంలో మనకి జఱిగిన ఉద్దేశపూర్వక అన్యాయం మాత్రం ఎవఱికీ జఱగలేదు. ఎవఱూ భాషారాష్ట్రం అడగని కాలంలో అది అడగడమే మనం చేసిన నేరం. అందుకు ఆద్యులం కావడమే మనం చేసిన పాపం.

    ఎప్పటికి తెలుసుకుంటారో ఈ వెఱ్ఱివెంగళాయి తెలుగువాళ్ళు, తమ సమష్టిసంక్షేమం గుఱించి ? ఎప్పటికి వీళ్ళు బాధ్యత తెలుసుకొని, పిల్లకాయ చేష్టలు మాని పెద్దవాళ్ళుగా ఎదుగుతారో ? ఎప్పటికి వీళ్ళు ఇతరులకి పనికిరావడం మానేసి, తమ శక్తి తాము తెలుసుకొని తమకి తాము పనికొచ్చేవిధంగా ప్రయోజకులవుతారో ?

    కావాలి దేశానికిప్పుడు కనీసం కొద్దిమంది అటువంటివారు....
    6:00 AM వీరిచే పోస్ట్ చెయ్యబడింది LBS తాడేపల్లి
    లేబుళ్లు: తెలుగు - తెలుగుజాతి - తెలుగునేల

    భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన కొత్తల్లోను, నెహ్రూ-ఇందిరా హయాముల్లోను జాతిసమైక్యానికి చాలా ప్రాధాన్యమిచ్చేవారు. ఎన్ని తేడాలున్నప్పటికీ అందఱమూ భారతీయులమేననే విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆనాటి నాయకులు ప్రతి బహిరంగవేదిక మీదా పదే పదే నొక్కి వక్కాణిస్తూండేవారు. కుల, మత, వర్గ, ప్రాంతాది ప్రస్తావనల్ని ప్రయత్నపూర్వకంగా నిరుత్సాహపఱచేవారు. సంకుచిత భావాలు మనసుల్లో ఏ మూలనో ఉన్నా వాటిని వ్యక్తీకరించడానికి జనం జంకే పరిస్థితి ఉండేది ఆనాటి సమాజంలో !

    ఇప్పుడు పరిస్థితంతా పూర్తివిరుద్ధంగా మారిపోయినట్లు కనిపిస్తున్నది. దేశంలో ఎల్లెడలా సంకుచితత్వం బాహాటంగా సిగ్గూ, లజ్జా విడిచి, గుడ్డలు విప్పుకొని, బిగ్గఱగా నోరుపెట్టుకుని, అఱుస్తూ విజృంభిస్తున్నది. వాఙ్మర్యాదలతో సహా ప్రతి విషయంలోను మనం నియంత్రణ కోల్పోయినట్లు తోస్తున్నది. ఉదాహరణకి ఇతర రాష్ట్రాలవారి మీద శివసైనికుల దౌర్జన్యం. అలాగే మన రాష్ట్రంలో "అదుర్స్" సినిమా మీద తె.రా.స.వారి దాడులూను. దాడికారుల రాజకీయ అభిప్రాయాల కంటే భిన్నమైన సొంత రాజకీయ, సాంస్కృతిక అభిప్రాయాల్ని దాడుల బాధితులు కలిగి ఉండడమే ఈ రెండు రాష్ట్రాల్లోను వారు చేసిన మహాపాపం. అయితే మహారాష్ట్ర పరిస్థితికీ, మన పరిస్థితికీ మధ్య ఒక ప్రాథమిక వ్యత్యాసం ఉన్నది. అక్కడ జఱుగుతున్నవి మరాఠీ అభిమానులు నాన్-మరాఠీల మీద చేస్తున్న దాడులు కాగా మన దగ్గఱ జఱుగుతున్నవి మాత్రం వట్టి నరమాంస భక్షక దాడులు (cannibalistic attacks). ఎందుకంటే ఇవి ఒక ప్రాంతీయులు స్వయంగా తమ సొంత భాషా-మత-జాతి-సంస్కృతి-సంప్రదాయాలకే చెందిన ఇతరప్రాంతాల జనం మీద ఊహాజనిత శత్రుత్వంతో జఱుపుతున్నవి. ఇవి చాలా దారుణమైనవి. ఎందుకంటే వీటికి దీటైన పూర్ణోపమలు ప్రపంచచరిత్రలో ఇతరత్ర దుర్లభం.

    హఠాత్తుగా మనలో కిరాతకత్వమూ, బర్బరత్వమూ ఎందుకిలా జడలు విఱబోసుకుని వికటాట్టహాసం చేయసాగాయి ? ముద్రణలో కనిపించే, చెవులకి వినిపించే ప్రతి సంకుచిత వైఖరికీ, ద్వేషప్రచారాలకీ మనమెందుకిలా అసంకల్పితంగా లొంగిపోతున్నాం ? సొంతంగా ఆలోచించుకోనివ్వకుండా మనల్ని ఇలా మారుస్తున్నదెవఱు ? స్వాతంత్ర్యోద్యమకాలంలో, అంతటి అణచివేత మధ్యా, అన్ని కఱువుల నడుమ మన పూర్వీకులలో స్వభావసిద్ధంగా వెల్లివిఱిసిన మానవత్వానికీ, ఈనాడు ముప్పూటలా మెక్కుతూ మనం ఉద్దేశపూర్వకంగా అభివృద్ధి చేసుకుంటున్న పశుత్వానికీ పోలికేది ?

    వెనక్కి తిరిగి చూసుకుంటే, స్వాతంత్ర్యోద్యమకాలపు నాయకులు ఈ కాలపు నాయకులవంటివారు కారు. వారు ఉద్యమనాయకులే తప్ప మనకి తెలిసిన అర్థంలో కాకలు దీఱిన వ్యూహకర్తలు గానీ, కరుడుగట్టిన రాజకీయనాయకులు గానీ కానేకారు. వారు పెద్దపెద్ద ఉమ్మడి కుటుంబాలలో పెఱిగిన వట్ఠి పాతకాలపు బోళా మనుషులు. గ్రామీణ భారతదేశపు శ్రమైకజీవన సౌందర్యాన్ని ఎఱిగినవారు. నగరాల నయగారాలకి మూర్ఛపోయినవారు కారు. జీవితంలో కష్టం, సుఖం తెలిసినవారు. దైవభక్తులు. గురుభక్తులు. పాపభీతులు. వారు పండితులూ, ఆలోచనాపరులూను. తరువాతి కాలంలో వారంతా దేశానికి రాష్ట్రపతులూ, ప్రధానమంత్రులూ, ముఖ్యమంత్రులూ, గవర్నరులూ కావడం యాదృచ్ఛికంగా, అనుకోకుండా జఱిగింది. కానీ ఆ పదవుల గుఱించి వారెన్నడూ కలలుగని ఉండలేదు. అసలు తమ ఆయుష్కాలంలో దేశానికి స్వాతంత్ర్యం వస్తుందని అనుకోలేదు. తమ జీవితాలు చెఱసాల గోడల మధ్యే ముగిసిపోతాయనుకుని అందుకోసం మానసికంగా సిద్ధపడి ఉండేవారు. నాకనిపిస్తుంది - వారే గనక మళ్ళీ బతికొస్తే మన ప్రవర్తన, వాలకమూ చూసి చాలా విస్తుపోతారని ! వారు తమ కాలంలో స్వాతంత్ర్యోద్యమం కోసం ఏ సంకుచితాలనైతే వద్దనుకున్నారో సరిగ్గా వాటినే మనం ఆధికారికంగా, చట్టపూర్వకంగా, మీదుమిక్కిలి బహిరంగంగా ప్రజావేదికల మీదా, విశ్వవిద్యాలయాల్లో సైతం గుర్తించి, గౌరవించి ప్రోత్సహించడం - ఇదంతా వారికి వాంతి రప్పించవచ్చు.. ఈనాటి రాజకీయపక్షాలూ, వాటి మేనిఫెస్టోలూ, కులపరమైన/ మతపరమైన దూషణలతో నిండిపోయిన వెబ్‌సైట్లూ, పత్రికలూ, ప్రాంతీయోద్యమాలూ, ద్వేషాలూ, హింస గట్రా చూస్తే స్వాతంత్ర్యోద్యమం ద్వారా వారు మనకి నేర్పిపోయిన విలువలకి సుదూరంగా మనం చాలా క్రోసులు ఇవతలికి వచ్చేశాం.

    బహుశా మనం మన యొక్క దయనీయమైన అవగాహనాలేమితో వారి చిరజీవితకాలపు శ్రమనంతా బూడిదలో పోసిన పన్నీరు చేస్తున్నాం. ఈ దేశాన్ని నిర్మించిన తొలితొలితరాల నాయకులు ఒక ఉత్తేజపూరితమైన భావిదర్శనం (future vision) తో పనిచేశారు. వారు చెఱసాలల్లో కూర్చుని తమ వర్ణరంజితమైన తీపికలల్లో భావి సుందర ఆదర్శదేశాన్ని స్వప్నించారు. సామ్రాజ్యవాదుల కంటే భిన్నంగా పరిపాలించే అంకిత దేశభక్తుల ధర్మబద్ధ సారథ్యాన్ని వారు ఊహించుకున్నారు. అందఱి భాషాసంస్కృతులకీ తుల్యగౌరవ పురస్కారాలు లభించే సువిశాల భూఖండాన్ని, భారతజాతి మఱియు అందులోని ఉపజాతులూ అన్నీ కలిసికట్టుగా మనగలిగే సమైక్య భారతదేశాన్ని వారు దర్శించారు. ఆయా జాతులకీ, వాటి సంస్కృతులకీ బ్రిటీష్ పాలన ద్వారా జఱిగిన పరాభవాల్నీ, ఉపేక్షనీ, అన్యాయాల్నీ చక్కదిద్దే సదుద్దేశంతోనే వారు వివిధరాష్ట్రాల్ని ఏర్పఱచాలని నిర్ణయించుకున్నారు. స్వాతంత్ర్యం వచ్చాక ఆ దర్శనాన్ని కాస్తకాస్తగా కార్యరూపంలో పెట్టారు. ఆ నాయకులకు ఈ కాలపు నాయకుల మాదిరి వ్యక్తిగత ప్రయోజనాల్ని, ప్రాంతీయ స్వార్థాల్ని, వర్గస్పృహల్ని ఆపాదించడం మిక్కిలి అసమంజసం. తమ తదనంతరం చోటు చేసుకున్న అనూహ్యాలకి వారిని బోనెక్కించాలని చూడ్డం అన్యాయం. అది వారు పడ్డ కఠోర శ్రమనీ, వారి నిరుపమాన త్యాగాల్నీ అవమానించడమే అవుతుంది. ఈ ఆరోపణలే నిజమైతే ఆ నాయకులు ఏమీ సంపాదించుకోకుండా ఎందుకు అకించనులుగా గతించారనే ప్రశ్నకి సమాధానం కావాలి. సంపాదనలనేవి వారంతా పోయాకనే ఎందుకు మొదలయ్యాయనేది కూడా అవగతం కావాల్సి ఉంది. వారు తమ కాలంలో బ్రిటీషు పాలనని అభివర్ణించడానికి వాడిన పదజాలాన్ని – దోపిడిదార్లు గట్రా - ఈనాడు మనం కాపీకొట్టి స్వదేశ పాలకుల మీదా, స్వదేశ వ్యాపారుల మీదా ప్రయోగించడం, స్వదేశ పౌరుల మీద ప్రయోగించడం, సాక్షాత్తు స్వరాష్ట్ర పౌరుల మీద కూడా ప్రయోగించడం ఎంతవఱకు సమీచీనం ? ఖచ్చితంగా స్వాతంత్ర్యోద్యమవీరులు ఈ పరిస్థితిని ఊహించి ఉండరు. పెళ్ళి చేసి అక్షింతలు వేసి ఆశీర్వదించే పెద్దలు, ఆ వధూవరులు కలకాలం కళకళలాడుతూ కాపరం చెయ్యాలనే ఆశిస్తారు. ఆ తర్వాత ఆ వధూవరులకి అలా బతకడం చేతకాకపోతే పెళ్ళిపెద్దల్ని దూషించడం, వారికి లేనిపోని స్వార్థ దురుద్దేశాల్ని అంటగట్టడం సమంజసం కాదు.

    మనలోని ఈ అంతర్గత కుమ్ములాటల వెనక అసలు కారణం - మనందఱికీ కలిపి ఒక ఉమ్మడి శత్రువు లేకపోవడమేమోనని నాకు అనిపిస్తున్నది. అటువంటి శత్రువు ఉంటేనే మనం ఏకమవుతాం. లేకపోతే మనవాళ్ళని మనమే నఱుక్కుని చంపుకుంటాం. ఇదే నిజమైతే మన జాతీయవాదమంతా ఒక కపటనాటకం. ప్రజల్ని ఏదో ఒక ప్రాతిపదికన, ఏదో ఒక వాదంతో విడగొట్టే నాయకుల్ని బహిరంగంగా అసహ్యించుకునే స్థాయికి ఇంకా మనవాళ్ళు ఎదగలేదు. అందువల్ల మన నాయకులక్కూడా ఎదగాల్సిన అవసరం లేకుండా పోతోంది. మేధావులు ఏ సంస్కరణ కావాలని డిమాండు చెయ్యరో దాన్ని అందించాల్సిన అవసరం నాయకులకి లేదు. పైపెచ్చు అలా విడగొట్టేవాళ్ళే అసలుసిసలైన నాయకులుగాను, అందఱమూ కలిసుండాలని చెప్పేవాళ్ళు బఫూన్‌లుగాను చూడబడే పరిస్థితి వచ్చింది.

    అందుచేత ఈనాటి మన అత్యవసర చారిత్రిక ఆవశ్యకత - స్వాతంత్ర్యోద్యమ కాలంలో మాదిరి జనాన్ని కలిపే నాయకులు. జనానికి "ఇది మంచి, ఇది చెడు" అని చెప్పే ధైర్యమున్న నాయకులు. జనాన్ని చూసి పిఱికిగొడ్లలా గడగడ వణక్కుండా లక్షలాదిమంది ముందు నిబ్బరంగా నిలబడి "అయ్యలారా ! నేను మీతో విభేదిస్తున్నాను. నా సొంత అభిప్రాయం ఇలా ఉంది." అని ఎలుగెత్తగల నాయకులు. 1.3.10తెలుగుజాతికి తెలుగుదేశం పార్టీ ద్రోహం
    9:33 AM వీరిచే పోస్ట్ చెయ్యబడింది LBS తాడేపల్లి
    లేబుళ్లు: తెలుగు - తెలుగుజాతి - తెలుగునేల

    తెలంగాణ విషయంలో తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్న తీరు పూర్తిగా అభ్యంతరకరం. ఇందులో రెండు విషయాలున్నాయి. ఒకటి - సైద్ధాంతికం. రెండు - ఆచరణాత్మకం. కానీ ప్రస్తుతం ఆ పార్టీలో ఈ రెండూ లోపించాయి. తెలుగుదేశం పార్టీ తెలుగువారి సంక్షేమం కోసమే కాక వారి సమైక్యం కోసం కూడా ఆవిర్భవించింది. దాని వ్యవస్థాపకుడు స్వర్గీయ డా|| ఎన్.టి. రామారావుగారు లేవనెత్తిన తెలుగువారి ఆత్మగౌరవ నినాదంలోనే తెలుగువారి సమైక్య భావన అంతర్‌నిహితంగా ఇమిడి ఉంది. ఎందుకంటే సమైక్యం లేని ఆత్మగౌరవం ఒక మనోభ్రాంతి. జాతినంతా ఒకే మానకం (unit) గా చూడకపోతే ఆత్మగౌరవ నినాదం అర్థం కాదు కూడా. చీలికలూ, వాలికలై కొట్టుకుచచ్చే జాతులు ఇతర జాతుల దృష్టిలో అపహాస్యానికి గుఱవుతారు తప్ప వారికి ఏ గౌరవమూ ఉండదు. పైగా ఆ కొట్టుకుచచ్చేవారు తమ అంతఃకలహాలలో భాగంగా తమవారి గుఱించే తాము హీనంగా ప్రసంగిస్తారు.

    తెలుగుదేశం పార్టీ బెదుఱుగొడ్డు రాజకీయాలు : ఆచరణాత్మకంగా తెలుగుదేశం పార్టీ వేర్పాటువాద శక్తులతో చేతులు కలిపింది. లేని తెలంగాణ సెంటిమెంటుని ఊహించుకొని, బలం లేని తె.రా.స.తో జట్టుకట్టి, తమ బలంతో దాన్ని పది స్థానాల్లో గెలిపించి అనవసరంగా వేర్పాటువాదాన్ని పెంచిపోషించిన పాపం ఆ పార్టీది. చిరంజీవిని చూసి మళ్ళీ ఆయనకు లేని బలాన్ని ఊహించుకొని గడగడా వణికిపోవడం, ఆ వణుకులో ఆదుర్దా నిర్ణయాలు తీసుకొని బోల్తాపడడం ఇందుకొక కారణం. ఇప్పుడు రాష్ట్రంలో విజృంభించిన వేర్పాటువాదాలన్నింటికీ తెలుగుదేశం పార్టీ అవలంబించిన తప్పుడు విధానాలే కారణం అంటే అతిశయోక్తి కాదు.



    ఈ మాట చెప్పేటప్పుడు నేను 2004 నాటికి ముందున్న పరిస్థితి గుఱించి మాట్లాడ్డంలేదు. తెలుగుదేశం పార్టీ రాష్ట్రవిభజనకి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నప్పటి నుంచే ఈ రాష్ట్రంలో సమైక్యవాదులకి, వారి ఆస్తులకీ భద్రత కఱువైంది. వ్యక్తిగతంగా చంద్రబాబునాయుడుగారికి తప్ప ఎవఱికీ భద్రత లేని దారుణ పరిస్థితి. సమైక్యం గుఱించి మాట్లాడ్డమే నేరమైపోయింది. సమైక్యభావనే అపహాస్యం పాలైపోయింది. తెలుగుదేశంవాళ్లే రాష్ట్రవిభజనని సమర్థిస్తూంటే మీరెంత ? మేమెంత ? అనే వాదాలు మిన్నుముట్టాయి. తెలుగుదేశాన్ని చూసి కాంగ్రెస్సూ అదే బాట పట్టింది. "నీకంటె పెద్ద చవటాయిని నేను, నీకంటె పెద్ద వెధవాయిని నేను" అన్నట్లు వేర్పాటువాదాన్ని సమర్థిస్తూ ప్రకటనలు చేయడానికి పార్టీల మధ్య తోపుళ్ళూ, తొక్కిసలాటలూ మొదలయ్యాయి. ఇదంతా నిస్సందేహంగా తెలుగుదేశం పార్టీ పుణ్యమే.
    చిదంబరం డిసెంబరు 9 న తెలంగాణకి అనుకూలంగా ప్రకటన చేయడానిక్కూడా తెలుగుదేశమే ప్రధాన ప్రేరణ. ఆ రోజు వాళ్ళు "మద్దతిస్తా" మని చెప్పకపోతే చిదంబరం కేసీయార్ లొల్లిని నిశ్శబ్దపఱచడానికి ఇంకో మార్గం ఎంచుకుని ఉండేవాడు. వాళ్ళు మద్దతిస్తామని చెప్పడం వల్లనే "కందకు లేని దుఱద కత్తిపీటకెందుకు ? ప్రాంతీయపార్టీకి లేని అభ్యంతరాలు జాతీయపార్టీ అయిన మనకెందుకు ?" అనే తెగింపుతో చిదంబరం ఒక కత్తిలాంటి విధానప్రకటన బయటికి తీశాడు. జాతిని నిలువునా నఱికేశాడు. ఆ ప్రకటన అప్పటిదాకా సమైక్యవాదులుగా ఉన్న తెలగాణ్యుల్ని సైతం వేర్పాటువాదులుగా మార్చివేసింది. సందిగ్ధంలో పడి డోలాయమానంగా కొట్టుమిట్టాడుతున్న శంకాసంకోచపరులనేమో కఱుడుగట్టిన ఆంధ్రద్వేషులుగా ఉత్పరివర్తన (mutation) చెందించింది. కఱుడుగట్టిన వేర్పాటువాదుల్ని హింసలకూ, ఆత్మహత్యలకూ ప్రేరేపించింది. ఒక్కముక్కలో చెప్పాలంటే తెలంగాణ మొత్తం ఒక ఎఱ్ఱగడ్డ పిచ్చాసుపత్రిగా మారిపోయింది. కేసీయార్ తొమ్మిదేళ్ళపాటు అష్టకష్టాలు పడీ సాధించలేకపోయిన మానసిక పరిణామాన్ని చిదంబరం ఒక్కరోజులో సాధించేశాడనడం సబబు.

    బుద్ధిలేని/ బుద్ధిరాని తెలుగుదేశం పార్టీ : 2009 సాధారణ ఎన్నికల్లో తె.రా.సతో జట్టుకట్టడం వల్ల తెలుగుదేశం పార్టీకి విఱగబడిందీ, ఒఱిగిపడిందీ ఏమీ లేదు. అటువంటప్పుడు ఎన్నికలైపోగానే "తెలంగాణ ప్రజలు తె.రా.స.తో మా జట్టుని ఆమోదించలేదు. ఎందుకంటే మాకు మెజారిటీ రాలేదు" అని కన్వీనియంట్ గా వేర్పాటువాద కోఱల్లోంచి తెలుగుదేశం తాను బయటపడి ప్రజల్ని కూడా బయటపడేయాల్సింది. ఆ పార్టీ అలా చెయ్యలేదు. మూతి కాలినా కుంపటే ముద్దు అన్నట్లు ఇంకా "మేము స్పష్టంగా చెబుతున్నాం. ప్రత్యేక తెలంగాణకి మా మద్దతుంటుంది" అని పిచ్చికూతలు కూస్తూ వచ్చారు. దివంగత రాజశేఖరరెడ్డి పదేపదే "తెలుగుదేశానికున్న విశ్వసనీయతెంత ?" అని ప్రశ్నించడంతో అతని మీద పోటీగా తెలంగాణవాదుల్లో విశ్వసనీయత సంపాదించుకోవడం కోసం ఈ మూర్ఖధోరణిని కౌగలించుకున్నట్లు కనిపిస్తున్నది. విశ్వసనీయత అంటే పరిస్థితులకు విరుద్ధంగా నడిచే మూర్ఖత్వం కాదని వారు అర్థం చేసుకోలేదు. తత్ఫలితంగా కేసీయార్ దీక్ష, తదనంతర పరిణామాల్ని ఎదుర్కునే సత్తా తెలుగుదేశానికి లేకుండా పోయింది. 2009 ఎన్నికలైపోయిన వెంటనే మార్చుకుని ఉండాల్సిన పాలసీని హఠాత్తుగా ఉన్నపళాన మార్చుకోవడం సాధ్యపడక తాము తెలంగాణవాదులుగా, సమైక్యవాదులుగా చీలినట్లు నటించడానికి నిశ్చయించుకున్నారు. అలా మనతో (ప్రజలతో) డబల్ గేమ్ ఆడుకోవడానికి సిద్ధమయ్యారు. కానీ ఈ వ్యూహం ఫలించే అవకాశం శూన్యం. ఆంధ్రప్రాంతంలోను, తెలంగాణలోను కూడా తెలుగుదేశం పార్టీని అందఱూ అసహ్యించుకుంటున్నారు. ఎన్నికలు, ఇప్పుడు పెట్టినా, నాలుగేళ్ళ తరువాత పెట్టినా మళ్లీ కాంగ్రెస్సే అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇండియన్ కాంగ్రెస్ కాకపోతే, జగన్ కాంగ్రెస్ - ఏదైతేనేం ? నాయుడుగారికి ప్రతిపక్షనాయకుడి హోదా పెర్మనెంటయ్యేలా ఉంది.

    తానేంటో తనకే అర్థం కాకుండా పోతున్న నాయుడుగారు : కేసీయార్ పార్టీపెట్టకముందు అతనికీ, నాయుడుగారికీ మధ్య రహస్యంగా నడిచిన భీకర పోరాటాలేంటో మనకి తెలియదు. అతనిలో నాయుడుగారి పట్ల ద్వేషం యావత్తు ఆంధ్రావాళ్లమీద ద్వేషంగా మారింది. చివఱికి నాయుడుగారు - కేసీయార్ ల మధ్య సంవాదం కాస్తా ఆంధ్రా-తెలంగాణ సంగ్రామంగా రూపాంతరం చెందించబడింది. కేసీయార్ యొక్క తొమ్మిదేళ్ళ రాజకీయ నిరుద్యోగం కాస్తా ఏకంగా అఱవయ్యేళ్ళ తెలంగాణ అస్తిత్వపోరాటం అని ప్రచారమైపోయింది. నాయుడుగారు తాను అధికారంలో ఉన్నప్పుడు ఏ వాదాన్నైతే ఖండించారో ఆ వాదాన్నే ప్రతిపక్ష హోదాలో అంగీకరించి, ఆమోదముద్ర వేసి వాటేసుకోవాల్సిరావడం - ఆయనకెలా ఉందో గానీ ఆయన అభిమానులకీ, తెలుగుదేశం సానుభూతిపరులకీ మాత్రం తలకొట్టేసినట్లుంది. ఎవఱేమన్నా "మనకి తెలుగుదేశం ఉందిలే" అని క్రిందటేడాది వఱకూ మానసిక భరోసాలో జీవిస్తున్న గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు ఇప్పుడు హఠాత్తుగా మొఘలాయి సామ్రాజ్యపు చివఱి రోజులప్పుడు నాదిర్‌షా దండయాత్రలోని ఢిల్లీలో ఉన్నట్లు అనుభూతి చెందడం మొదలుపెట్టారు.

    తెలుగుదేశం నాయకుల ప్రవర్తన : ఈ మధ్య ఒక తెలుగుదేశం నాయకుణ్ణి ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రాంగణం (campus) లో విద్యార్థులు పృష్ఠం మీద తన్ని, కింద పడేసి కుళ్ళబొడిచారు. అదే, నాబోటివాడయితే "ఛీ ! ఈ ఉద్యమానికి దూరంగా ఉంటా"నని నిశ్చయించుకుని అవతలికి పోయేవాడు. ఆ చీమూ, నెత్తుఱూ తెలుగుదేశం నాయకుల్లో కలికానిక్కూడా కానరావట్లేదు. అలా తన్నించుకొని మళ్ళీ తెలంగాణ ఐ.కా.స. (ఐక్య కార్యాచరణ సమితి) నాటకంలో పాత్ర పోషించడానికి సిద్ధమయ్యారు. సిద్ధమవ్వడమే కాకుండా, అప్పటిదాకా కేసీయార్ చేసిన రెచ్చగొట్టుడు ప్రకటనల్లాంటివి పెద్ద వీరతెలంగాణవాదుల మల్లే తాము కూడా చేయడం మొదలుపెట్టారు. వీళ్ళు ఒకప్పుడు చంద్రబాబునాయుడుతో సమానంగా రాష్ట్రస్థాయి మంత్రులుగా పనిచేసినవాళ్ళు. యావత్తు తెలుగుజాతిలోను ఒక గౌరవనీయ మూర్తిమత్త్వం (respectable image) ఉన్నవాళ్ళు. ఇప్పుడిలా ప్రాంతస్థాయికీ, ఉపప్రాంతస్థాయికీ దారుణంగా దిగజాఱిపోయారు.

    కాంగ్రెస్ పోషించిన పాత్రని తలకెత్తుకున్న తెలుగుదేశం : కాంగ్రెస్ తాను అధికారంలో లేనప్పుడల్లా ప్రాంతీయద్వేషాలు రెచ్చగొట్టి తెలుగుదేశాన్ని అస్థిరపఱచాలని ప్రయత్నిస్తూ వచ్చింది. అధికారంలో ఉన్నప్పుడు సమైక్యవాదినని చెప్పుకున్న దివంగత రాజశేఖరరెడ్డి అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నరోజుల్లో "రాయలసీమ విద్రోహదినం" అంటూ ఉద్యమాలు నడిపాడు. 1999 లో కేసీయార్ ఇంకా తెలుగుదేశంలో కొనసాగుతున్నరోజుల్లోనే - ప్రత్యేక తెలంగాణ కావాలంటూ రాష్ట్ర కాంగ్రెస్ అఖిల భారత కాంగ్రెస్ కేంద్ర కమిటీకి పంపిన విజ్ఞాపన పత్రం మీద సంతకం కూడా పెట్టాడు. అధికారంలోకి వచ్చాక దాని గుఱించి అడిగితే "అందులో ఏముందో చదవకుండానే సంతకం పెట్టేశాను, హడావిడిలో" అని బుకాయించాడు. అసలు అధికారంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ ముఠాల పని - ప్రాంతీయభావాల్ని తమ పదవుల కోసం, ముఖ్యమంత్రుల్ని అసమ్మతితో ఇఱుకున పెట్టడం కోసం రెచ్చగొట్టడమే. ఇప్పుడు తెలుగుదేశం ఆ పనిని భుజానికెత్తుకున్నట్లు తోస్తున్నది. "తెలంగాణ రాదు" అనే నమ్మకం మీద ఉన్నంతకాలం ఇటు తెలంగాణలోను, అటు ఆంధ్రలోను కూడా ఎవఱిష్టమొచ్చినట్లు వారు ఆ సమస్యతో ఫుట్‌బాల్ ఆడుకున్నారు. ఉదాహరణకి - అంతా అయిపోయాక ఇప్పుడు సమైక్యవాద కబుర్లు చెబుతున్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు 2004 ఎన్నికల్లో "తెలుగువారికి రెండు రాష్ట్రాలుంటే తప్పులే"దని యథేచ్ఛగా మాట్లాడిన వ్యక్తే. అప్పుడు తన భార్య తె.రా.స.తో జట్టుకట్టిన కాంగ్రెస్ తరఫున బరిలో ఉంది కనుక తనకా మడతనాలుక అవసరమైంది. ఆ ఫుట్‌బాల్ ఇప్పుడు రాష్ట్ర గోదా దాటిపోయి కేంద్రం కోర్టులోకి వెళ్లినాక ఫైర్‌బాల్‌గా మారింది. అందుకని ఇప్పుడు దిక్కుతోచడం లేదెవఱికీ.


    మరణశయ్యపై రాజకీయాలా ? : ఆంధ్ర-తెలంగాణ ప్రాంతాల పూర్వ మహామహులు కొన్ని ఉన్నతాదర్శాలతో, ఉదాత్తాశయాలతో, దూరదృష్టితో కలలుగని స్థాపించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అటుపిమ్మట ఇంకెందఱో మహనీయులు శ్రమించి నిలబెట్టిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం - దీని ఉనికికే ప్రమాదం ఏర్పడ్డ స్థితిలో మన చర్యలూ, మాటలూ మఱింత జాగ్రత్తగా ఉండాలి. కానీ తెలుగుదేశంవారి దగ్గఱ ఆ బాధ్యతాయుత భావమేమీ కనిపించడంలేదు. ఒక పక్క రాష్ట్రం చావుబతుకుల్లో ఉంటే వారు మంచం పక్కన చేఱి రాజకీయాలాడుతున్నారు. చావుబతుకుల సమస్య వస్తే ఎటో ఒకవైపు దూకెయ్యాలి గానీ రెండు పడవల మీద కాళ్ళు పెట్టడం మొదటికే మోసం. రాజ్యమంటూ ఒకటుంటే ఎన్ని రాజకీయాలైనా ఆడొచ్చు. రాజ్యమే పోయాక రాజకీయాలతో పనేంటి ? కుటుంబమే లేనివాడికి సొంతిల్లైనా అద్దిల్లైనా ఏ యిల్లైనా ఒకటే. "అబ్బిగాడు చస్తే ఆ పంచె నాకే" అనుకొని పరస్పర వినాశనాన్ని కోరుకుంటే అందఱమూ నశిస్తాం. "ఆంధ్ర, తెలంగాణ రెండూ నాకు రెండు కళ్లు" లాంటి ఉద్ఘాటనలు ఎందుకవసరమవుతాయో నేనూహించజాలను. రాష్ట్రం ఇంకా చనిపోలేదు. బతికే ఉంది. అది తెలంగాణగా, ఆంధ్రాగా ఇంకా ముక్కలవ్వలేదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ గానే ఉంది. అదింకా చనిపోకుండానే దాన్ని ఇలా మాటలతో చంపేయడం అన్యాయం. అది రెండు కళ్ళో, రెండు కాళ్ళో కాదు. అదొక సర్వసమగ్ర శరీరం. ఈ మాటలతో వారు రాష్ట్రాన్ని చంపుతున్నారు. తెలుగుదేశం సిద్ధాంతాల్ని చంపుతున్నారు. టోకుగా ఎన్.టి.రామారావుగారినే సైద్ధాంతికంగా చంపేశారు.

    ఇప్పుడేం మిగిలింది తెలుగుదేశంలో చూసుకుని గర్వించడానికి ? 6.2.10ఏల నీకీ దుఱద ?
    6:51 AM వీరిచే పోస్ట్ చెయ్యబడింది LBS తాడేపల్లి
    లేబుళ్లు: తెలుగు - తెలుగుజాతి - తెలుగునేల

    హైదరాబాదులో ఐ.టి.ఐ.ఆర్. (ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్‌ఫ్రాస్టక్చర్ రీజియన్ - సమాచార సాంకేతికతా మౌలిక సదుపాయాల బస్తీ) ఏదో ఏర్పాటు చేస్తామని రోశయ్య ప్రభుత్వం ప్రకటించింది. అందుకోసం షమ్సాబాదు దగ్గఱా, మఱొకచోటా కొన్నివేల ఎకరాలు కేటాయిస్తారట. సదరు చేపట్టు (project) కోసం రాబోయే ఆఱేళ్ళలో రెండులక్షల కోట్ల రూపాయలు వెచ్చిస్తారట. తద్ద్వారా పదిహేను లక్షల ఉద్యోగాలు ఏర్పడతాయని ఆశిస్తున్నారు.

    దేనికీ డబ్బుల్లేవని చేతులెత్తేసిన రోశయ్యగారికి రెండు లక్షల కోట్లు ఎక్కణ్ణుంచి రాబోతున్నాయో, ఎవఱు ఇవ్వబోతున్నారో నాకు తెలియదు. ఇలాంటిదేదో మద్రాసు, బెంగుళూరు, బొంబాయి లాంటి చోట్ల ప్రతిపాదిస్తే అందులో నమ్మరానంత విడ్డూరమేమీ ఉండదు. కానీ మనం ఉన్న పరిస్థితుల్లో హైదరాబాదుకు అంత సీనుందా ? మొన్న మన సోదరుల ప్రతాపానికి చాలామంది బిచాణా ఎత్తేయడానికి సిద్ధమయ్యారు. ఈ ప్రతాపాలు ఇలాగే ప్రదర్శిస్తూ పోతే ఉన్నవాళ్ళు కూడా ఉండరు. కొత్తగా ఎవఱొస్తారు, డబ్బుసంచులు పట్టుకొని ?

    అదనంగా పదిహేను లక్షల ఉద్యోగాలంటే పదిహేను లక్షల అదనపు జనాభా. మనుషులు ఏకాకులుగా బతకరు కనుక వాళ్ళ కుటుంబసభ్యుల్ని కూడా కలుపుకుంటే రాబోయే ఆఱేళ్ళలో హైదరాబాదుకు కొత్తగా వచ్చిపడే జనాభా మఱొక యాభైలక్షలు. ఇంత తక్కువ వ్యవధిలో ఇంత ఎక్కువ జనాభాని భరించే సత్తా హైదరాబాదుకు ఉందా ? ఒక కుటుంబంలోనే ఇంకో మనిషి అదనంగా తోడైతే - ఆ మనిషి కోసం సకల ఏర్పాట్లూ అదనంగా చెయ్యాల్సివస్తుందనుకున్నప్పుడు యాభైలక్షలమందికి నీరూ, డ్రైనేజి, రోడ్లు, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లు - ఇవన్నీ సమకూర్చే సావకాశం మనకుందా, అదీ ఆఱేళ్ళ స్వల్పవ్యవధానంలో ? ఇప్పుడు మధ్యహైదరాబాదులో ఉన్న నీటి సరఫరా, డ్రెయినేజి ఏర్పాట్లే నిజాం కాలం నాటివి. మెదక్ జిల్లా అవసరాల కోసం ఏర్పాటు చేసిన సింగూరు జలాశయాన్ని హైదరాబాదు అవసరాల కోసం మళ్ళించారు. హైదరాబాద్ తూర్పు మండలానికి కృష్ణాజలాల్ని కూడా తరలించారు. అయినా సరిపోవడంలేదు. చేవెళ్ళ-ప్రాణహిత చేపట్టు ద్వారా గోదావరి నీళ్ళు తేవాలని సంకల్పించారు. అదింకా సంకల్పం స్థాయిలోనే ఉంది. ఎందుకంటే దాన్ని అమలు జఱపాలంటే ౩౮,౦౦౦ కోట్లు కావాలి. మఱొక పక్క హైదరాబాదులో భద్రత నానాటికీ తీసికట్టుగా మారుతోంది. దానికి రాష్ట్రసరిహద్దుతో గల సామీప్యం వల్ల అక్కడ నేరాలు చేసి గంట/ అఱగంటలో సరిహద్దు దాటి పారిపోయే అయాచిత సౌలభ్యం నేరస్థులకి వరప్రసాదంలా మారింది. హైదరాబాదులోని భటవ్యవస్థ సాపేక్షంగా దుర్బలమైనది. అంత పెద్ద నగరానికీ కలిపి తొమ్మిదివేలమంది కంటే భటులు లేరు. అదే, బెంగుళూరులో ముప్ఫైవేలమంది ఉన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం పోలీస్ కమీషనర్ నాతో చెప్పినదేంటంటే - పోలీసు వాహనాలు నడవడానికి సరిపడా ఇంధనఖర్చుల్ని కూడా ప్రభుత్వం ఇవ్వడంలేదనీ, కొదవపడ్డ మొత్తాల్ని తమ సిబ్బంది జేబులోంచి పెట్టుకొని జీపులూ, వ్యాన్‌లూ నడుపుతున్నారని ! మఱి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో నాకు తెలియదు. మఱీ ఎక్కువ భిన్నంగా లేకపోవచ్చు. అందుచేత ఈరోజు పరిస్థితేంటంటే రాష్ట్రంలో ఏ మూలకైనా వెళ్ళి హాయిగా మనశ్శాంతిగా బతగ్గలం, హైదరాబాదులో తప్ప !

    ఈ పదిహేను లక్షల ఉద్యోగాల్లో మూడొంతుల కంటే ఎక్కువశాతం స్థానికేతరులకే వెళతాయనేదాంట్లో నాకు సందేహం లేదు, గత పరిశీలనల దృష్ట్యా ! తద్భిన్నంగా జఱగడానికి వాస్తవ పరిస్థితులు అనుకూలించకపోవడం వేఱే విషయం. ఏతత్కారణం చేత ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న ప్రాంతీయ తలనొప్పులూ, దుష్‌ప్రచారాలూ అప్పటికి ఇంకా ఇబ్బడిముబ్బడిగా ఇనుమడించే అవకాశం కనిపిస్తోంది. మన రాష్ట్రానికి హైదరాబాదు ఒక శాపం. ఆ నగరం మన రాష్ట్రానికి పట్టిన సైతాన్. అది మనకి జన్మజన్మల శని. అది మన జాతికి అక్రమసంబంధాల ద్వారా అంటుకున్నఎయిడ్స్ వ్యాధి. అదొక క్యాన్సరు. అది మన రాష్ట్ర అభివృద్ధినంతటినీ ఒక బ్రహ్మరాక్షసిలా, మహాభూతంలా భక్షించి వేస్తోంది. గ్రేటర్ హైదరాబాదు, గ్రేటర్ విశాఖపట్నం మెట్రోపాలిటన్ ఏరియాల్ని మినహాయిస్తే విజయవాడ-గుంటూరు అర్బన్ అగ్లోమరేట్, రాజమండ్రి అర్బన్ అగ్లోమరేట్ తో సహా మిహతా తెలుగురాష్ట్రమంతా పరమ దారుణంగా, ఎవఱికీ ఏ ఉద్యోగమూ ఇవ్వజూపలేనంతగా వెనకబడిపోయి ఉంది. హైదరాబాద్ ముసలి సుందరికి మాత్రం తొమ్మిదికోట్లమంది రాష్ట్రప్రజలు కట్టిన పన్నాదాయంతో ఎప్పటికప్పుడు సరికొత్త శోభలూ, సోయగాలూ అద్దుతున్నారు. ఎక్కడెక్కడి డబ్బూ, వనరులూ అన్నీ బలవంతంగా హైదరాబాదుకి తరలిస్తున్నారు. కార్యాలయాలన్నీ హైదరాబాదులోనే. విశ్వవిద్యాలయాలన్నీ హైదరాబాదులోనే. పరిశ్రమలన్నీ హైదరాబాదులోనే. ఉద్యోగాలన్నీ హైదరాబాదులోనే. ఈ జాతి చేస్తున్న అప్పులూ, తప్పులూ అన్నీ హైదరాబాదు కోసమే. రోశయ్య ప్రభుత్వం కల్పించదల్చుకున్న 15 లక్షల ఉద్యోగాల్నీ వరంగల్ లోనో, కరీంనగర్ లోనో, నెల్లూరులోనో, కర్నూలులోనో ఎందుకు కల్పించకూడదు ? అక్కడ ఏం కొదవ ? సరే, ఏదైనా కొదవపడితే దాన్ని పూరించడానికి ఆ రెండులక్షల కోట్లు అక్కడ చెల్లవా ? సర్దుబాటు కావా ?

    మిహతా రాష్ట్రం ఎలా బతుకుతోందో ఒక్కసారి పరిశీలించండి. అక్కడ రైసుమిల్లులూ, పిండిమరలూ, నూనెగానుగలూ మినహా వేఱే పరిశ్రమలేవీ లేవు. బడిపంతులు ఉద్యోగాన్ని లేదా స్థానిక చిట్‌ఫండ్/ కంపెనీలో గుమాస్తా ఉద్యోగాన్ని జాక్‌పాట్‌/ లక్కీ డ్రా కొట్టడంగా భావించే దశలోనే ఉన్నారు మన జనం. ఎక్కువమంది టైలరింగ్ మొదలైన అల్పాదాయపు స్వయం ఉపాధిరంగంలో స్థిరపడ్డవాళ్ళే ఉంటారు. మన జనాభా ఎగబడి ఎమ్.సి.ఏ.లూ గట్రా చదువుతున్న స్థాయికీ, జిల్లాలలో ఉన్న కంప్యూటర్ సదుపాయాలకీ పోలికే లేదు. వాటిని భరించే స్తోమత అక్కడ ఎవఱికీ లేదు. ఎందుకంటే అక్కడ ఆదాయాలు లేవు. (నిజం చెప్పాలంటే హైదరాబాదులో కూడా అంతర్జాలాన్ని (Internet) కార్యాలయ కంప్యూటర్ల ద్వారా తప్ప సొంత కంప్యూటర్ల ద్వారా ప్రాపించేవారు అఱుదు, అఱుదున్నఱ) ఇప్పటికీ మన ఊళ్ళల్లో నెలకి నికరంగా అయిదాఱువేలు సంపాదించేవాడు ఒక పెద్దమగాడని లెక్క. బహుశా కొన్నిమండలాల్లో ఆఱేడువేల ఆర్జనాపరుడు పెద్దమగాడు కావచ్చు. అంతకంటే భారీ వ్యత్యాసం ఉండదు. మన ఊళ్ళలోని విద్యావంత మధ్యతరగతికి సొంతిల్లు అనేది ఇప్పటికీ ఒక తీఱని యావజ్జీవిత కల. అక్కడి జనం అద్దెకొంపల్లో పుట్టి, అద్దెకొంపల్లో పెఱిగి, అద్దెకొంపల్లోనే చనిపోవడం చాలా మామూలు. కానీ హైదరాబాదుకు ఉద్యోగరీత్యా వచ్చినవారు వచ్చిన అయిదాఱేళ్ళలోనే, అదీ కేవలం ముప్ఫయ్యేళ్ళ వయసులోనే ఒక పెద్ద సొంత ఫ్లాటుకో, ఇంటికో స్వంతదారులైపోతారు. ఎందుకంటే హైదరాబాదులో బ్యాంకుల ద్వారా గృహఋణాల పరపతి సౌకర్యం బహు ఉదారమూ, బహువిఱివి. ఇవే బ్యాంకుల దృష్టిలో మన పల్లెపట్ల జనానికి మాత్రం అస్పృశ్యులతో సహపంక్తి. రాజశేఖరరెడ్డి వృద్ధాప్య పింఛన్లని కేవలం ఒక డెబ్భై అయిదు రూపాయలు పెంచినందుకు అతను పోతే మన ఊళ్ళలో మిలియన్లాది ముసలిజనం కన్నీళ్ళు పెట్టుకున్నారంటేనే తెలుస్తుంది, హైదరాబాదుకీ, మిహతా రాష్ట్రానికీ మధ్య ఆర్థిక స్థితిగతుల్లో ఎలాంటి అగాధాలూ, పర్వతాలూ, సముద్రాలూ, లోయలూ, కొండలూ, గుట్టలూ ఉన్నాయో ! సగటు నాన్-హైదరాబాదీ తెలుగువాడి సంపాదనాశక్తి ఎంత అధమాతి అధమంగా ఉందో ! వ్యవసాయమూ, చిన్నా చితక చిల్లఱవ్యాపారాలూ తప్ప తెలుగురాష్ట్రంలో వేఱే ఆదాయమార్గాలే లేవు. వాటిని కల్పించడం తన బాధ్యతగా ఈ ఆంధ్రప్రభుత్వం ఎప్పుడూ భావించి ఉండలేదు. గత 54 సంవత్సరాల్లో హైదరాబాదు, విశాఖపట్నం గుఱించి తప్ప ఇహ దేని గుఱించి పట్టించుకున్న పాపాన పోలేదు. తత్ఫలితంగా మన పల్లెలూ, పట్టణాలూ అష్టకష్టాలతో నిష్ఠదరిద్రమోడుతున్నాయి. విద్యావంతులంతా హైదరాబాదు బండి ఎక్కక తప్పని పరిస్థితిని యావద్రాష్ట్రంలోను కల్పించిందీ ప్రభుత్వం. ఇందులో తెలగాణ్యులు, దత్తమండలాలవారూ, కోస్తావారూ అనే తేడా కనిపించడం లేదు.

    మన రాష్ట్రానికి పట్టిన, పట్టుతూ ఉన్న దౌర్భాగ్యాలన్నింటికీ కారణం మనం ఇంతకాలం హైదరాబాదు చంకలో మట్టి దులుపుతూ బిజీ అయిపోవడం. హైదరాబాదు కంటే, విశాఖపట్నం కంటే ప్రాచీనమైన, ఉజ్జ్వల చరిత్ర గల పట్టణాల్నీ, నగరాల్నీ - వరంగల్, నెల్లూరు, కర్నూలు వంటివాటన్నింటినీ శంకరగిరిమాన్యాలు పట్టించారు. నిర్దయగా నిర్దాక్షిణ్యంగా పక్కన బెట్టారు. గతంలో ఆమోదించిన అన్ని ఒప్పందాల్లోను హైదరాబాదుని బాగుచేసే పథకాలకే పెద్దపీట వేశారు. అదొక్కటి పనిగట్టుకుని లెస్సగా అమలుజఱిపారు, మిహతా అంశాల సంగతెలా ఉన్నా ! రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు ఏ జిల్లావారైనా, ఏ ప్రాంతం వారైనా, ఏ రాజకీయ పక్షంవారైనా అందఱూ తడుముకోకుండా, బీరుపోకుండా చేసిన వెధవపని - హైదరాబాదుని బాగుచేయడం, ఆ తరువాత అక్కడ తమ పెట్టుబడులు పెట్టి వాటి మీద లాభాలు తీయడం. అదేంటో గానీ హైదరాబాదులో కానవచ్చే ౨౧ వ శతాబ్దపు జీవితానికీ, మన ఊళ్ళలో కనిపించే పదహాఱో శతాబ్దపు జీవితాలకీ అసలు పోలికే లేదు. అలా కేంద్రీకరించి పారేశారు అభివృద్ధిని ఒకే ఒక్క నగరంలో ! మన తెలుగువారి వేర్పాటువాదాల యొక్క, అంతర్గత కల్లోలాల యొక్క చరిత్రని ఇతివృత్తంగా తీసుకొని ఎవఱైనా భవిష్యత్తులో పుస్తకంగా రాస్తే దానికి నేను A Tale of One City అనే పేరు సూచించదల్చుకున్నాను.

    అన్నీ తెలిసి, జఱిగినదంతా చూసి, జఱుగుతున్నది అనుభవించీ కూడా ఇంకా మన ప్రభుత్వం హైదరాబాదుని బాగుచేయడానికే కంకణం కట్టుకున్నదంటే, అందుకు మనం బుద్ధిహీనుల్లా బుఱ్ఱకాయలాడించి ఆమోదం తెలుపుతున్నామంటే "ఛీ ! మనకెంత సిగ్గు లేదో ! సిగ్గలా ఉంచితే మనకెంత బుద్ధి లేదో !" అనిపిస్తున్నది. వాస్తవానికి హైదరాబాదు హోదా గత మూణ్ణెల్లుగా చాలా దిగజాఱింది. దాన్ని పరికించాల్సిన దృక్కోణంలో ఖచ్చితంగా మార్పొచ్చింది. అదిప్పుడు ఒక జాతికి ఉమ్మడి సమావేశకేంద్రం కావడం మానేసి ఆ జాతిలోని కొద్దిమంది వేర్పాటువాదుల చేతుల్లో బీభత్స మారణాయుధంగా మారింది. అది పట్టుకొని వారు ఇతరుల్ని బెదిఱిస్తున్నారు. ఈ బెదిఱింపులు జాతికి అవసరమా ? ఇహనైనా మేల్కొని హైదరాబాదుకు ప్రత్యామ్నాయ నగరాల్ని తయారు చేసుకొని, అలా అభివృద్ధిని వికేంద్రీకరించి వేర్పాటువాదాల బెడదని వదిలించుకోవాల్సిన తరుణం కాదా ఇది ? మనం ఇప్పటిదాకా నేర్చుకొన్న బహుచేదు గుణపాఠాల దృష్ట్యా హైదరాబాదు యొక్క తదుపరి అభివృద్ధిని శాయశక్తులా అడుగడుగునా అడ్డుకోవాల్సిన చారిత్రిక అవసరం మనకుంది. నా అభిప్రాయంలో - దీని అభివృద్ధి మీద కఠినమైన సీలింగులు విధించాలి. భవిష్యత్ ఉపాధికేంద్రాలన్నింటినీ తతిమ్మా తెలుగు నగరాలకే మళ్ళించాలి. ఉన్నవాటిని కూడా ఉన్నపళాన ఎత్తేసి అక్కడికి తఱలించమన్నా తప్పులేదు. ఇహముందు హైదరాబాదులో పరిశ్రమలూ, వ్యాపారాలూ పెడతామనేవాళ్ళని ప్రయత్నపూర్వకంగా నిరుత్సాహపఱచాలి. అసలు హైదరాబాదుని మనం చూసే పద్ధతిలోనే విప్లవాత్మకమైన మార్పు రావాలి. అది కేవలం ఒక ప్రభుత్వ కార్యాలయాల సముదాయంగా ఉండాలే తప్ప ఇతరత్రా దాన్ని మన యావత్తు జాతి జీవితానికీ ఆయువుపట్టుగా మార్చుకోవడం భవిష్యత్తులో అత్యంత ప్రమాదకరం. మన చుట్టూ ఉన్న మనుషుల సంగతెలా ఉన్నా, ఉదాహరణకి హైతీలో వచ్చిన భూకంపంలాంటి ప్రకృతివైపరీత్యం హైదరాబాదులో వస్తే అప్పుడేం చేస్తారు ? అడుక్కుతిందామా ?

    ఈ హైదరాబాదు దుఱదకి మంచి మందు వేసుకుని మళ్ళీ ఆరోగ్యవంతులుగా మారదాం. ఏ చేతులతో ఈ విషవృక్షాన్ని పెంచామో ఆ చేతులతోనే దీన్ని నిర్దాక్షిణ్యంగా పీకిపారేద్దాం. గత్యంతరం లేదు. 3.2.10దొంగలు బాబోయ్ దొంగలు-1
    4:04 PM వీరిచే పోస్ట్ చెయ్యబడింది LBS తాడేపల్లి
    లేబుళ్లు: తెలుగు - తెలుగుజాతి - తెలుగునేల

    ఆంధ్రప్రాంతీయుల్ని తమ వాచాకండూతి తృప్తిచెందే విధంగా దూషిస్తూ ఆ దూషణల్నే తమ వేర్పాటువాదానికి ప్రాతిపదికగా మలచుకొన్న కొద్దిమంది తెలగాణ్యుల సాముదాయిక తత్త్వాన్ని సక్రమంగా, వాస్తవిక దృష్టితో అంచనా వేయాల్సి ఉంటుంది. ఈ విధమైన వాదనలు చేసే వారెవఱూ ఆంధ్రప్రాంతాన్ని జన్మలో ఒక్కసారి కూడా స్వయంగా కళ్ళారా చూసి ఉండరు. అక్కడ కొద్దిసంవత్సరాలైనా నివసించి ఉండరు. ఏదేదో ఊహించుకోవడం తప్ప ఆంధ్రప్రాంత చరిత్ర ఒక్కసారి కూడా చదివి ఉండరు. చరిత్ర సంగతలా ఉంచి ఆంధ్రప్రాంతపు పూర్వీకులు వ్రాసిన తెలుగు సాహిత్యంలో పట్టుమని పదీ-ఇఱవై పుస్తకాల్ని కూడా గట్టిగా తిరగేసి ఉండరు. ఈ ప్రాంతంలో అసలు సమస్య పట్ల సమీచీనమైన అవగాహన కంటే కూడా ఆంధ్రప్రాంతంవారిపట్ల ప్రచారం చేయబడ్డ అసత్యాలూ, తన్మూలకమైన అసూయాద్వేషాలూ ఎక్కువగా ఉన్నాయి. ఆంధ్రప్రాంతీయులు తెలంగాణవాళ్ళ కంటే బాగున్నారనే ఏడుపుని ప్రతి తెలంగాణవాడిలోను కలిగించడంలో వేర్పాటువాదులు గత తొమ్మిదేళ్ళుగా సఫలీకృతులయ్యారు, ఆ మాటని ఏ ఆంధ్రావాడూ ఒప్పుకోకపోయినా సరే ! తెలంగాణవారు బాగాలేరట, బానే ఉంది. కానీ దానికి అంతర్గత కారణాలేంటనే ఆత్మవిమర్శ, అంతర్మథనమూ ఈ ప్రాంతంలో గోచరించడంలేదు. ఒకడు బాగున్నాడంటే దానిక్కారణం వాడు ఇంకొకణ్ణి దోచడమే అనే పాత కమ్యూనిస్టు పిడివాదం (dogma) లో తెలంగాణ యావత్తూ మునిగి తేలుతోంది. పక్కవాడు బాగాలేడంటే అందుకు తానే నూటికి నూఱుపాళ్ళూ కారణమని బాగున్నవాడు బేషరతుగా అంగీకరించి బేడీలేసుకొని స్వయం ప్రకటిత ముద్దాయిగా బోనెక్కాలి. బాగాలేనివాడికి తాను బాగుపడడం విషయమై ఏ విధమైన సొంత బాధ్యత గానీ, ఆసక్తి గానీ ఉండనక్కఱలేదు. ఇదీ తెలంగాణవాదుల న్యాయస్మృతి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలంగాణ నుండి తాగుడు ద్వారా వస్తున్న ఆదాయాన్ని (రాష్ట్రం యొక్క మొత్తం ఎక్సైజ్ ఆదాయంలో 60 శాతానికి పైనే) గమనిస్తే తెలంగాణ నిండా మద్యపానవ్యసనం (ఆడవాళ్ళు కూడా మినహాయింపు కాదు). ఇహ తెలంగాణ ఎలా బాగుపడుతుంది, ప్రత్యేక రాష్ట్రం వచ్చినా కూడా ? తెలంగాణలోని అంతర్గత సామాజిక లోపాల్ని, వైరుద్ధ్యాల్ని, స్వకీయమైన వైఫల్యాల్ని సమైక్యవాదంలోని లోపాలుగా, మీదుమిక్కిలి ఆంధ్రప్రాంతంవారి మోసాలుగా చిత్రించే ప్రయత్నం జఱుగుతున్నది. తమకి ప్రత్యేకరాష్ట్రం ఎందుకు కావాలో స్పష్టంగా చెప్పలేక ఆంధ్రప్రాంతీయులపై అభాండాలు వేసి, దూషించి, నిందించి వారిని విలన్‌లుగా చేసి మాట్లాడుతున్నారు. ఇది మహమ్మదాలీ జిన్నాగారి అడుగుజాడల్లో నడవడం తప్ప తదన్యం కాదు.

    టి.ఆర్.ఎస్. పార్టీ వారు గత తొమ్మిదేండ్లుగా ఒక ఆంధ్రద్వేష పుస్తకాన్ని ప్రచురించి తెలంగాణ మీదికి వదిలారు. దాన్ని లక్షలాది ప్రతులుగా ప్రచురించి అడిగినవాడూ, అడగనివాడూ అనే తేడా లేకుండా గోబెల్స్ ప్రచారంలా ప్రతి తెలంగాణవాడికీ అందించారు. అందులోని అవగాహనా రాహిత్యాలూ, అర్ధసత్యాలూ, అసత్యాలూ చదివిన ప్రతి తెలంగాణవాడూ అగ్గిమీద గుగ్గిలమైపోయి ఆంధ్రప్రాంతీయుల మీద ఒంటికాలిమీద లేస్తున్నాడు. అదే సమయంలో అది ఆంధ్రప్రాంతీయుల చేతిలో పడకుండా తెలంగాణవాదులు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎందుకంటే అందులోని విషయాలు ఆంధ్రప్రాంతీయుల దృష్టికి వస్తే వాటి వాస్తవికత్వమూ, ప్రామాణికత్వమూ (authenticity) నిష్కర్షగా ప్రశ్నించబడతాయి. అవి రాష్ట్రవ్యాప్తంగా చర్చించబడతాయి. అప్పుడు ఆ పుస్తకపు విశ్వసనీయత (credibility) ప్రశ్నార్థకమవుతుంది. "ప్రత్యేక" వాదన దూదిపింజలా తేలిపోతుంది. అందుచేత అలాంటి పుస్తకం ఒకటి ఉన్నట్లు, అందులోని అబద్ధాలన్నీ నగ్నసత్యాల్లా ప్రచారమౌతున్నట్లూ నాబోటి బహుకొద్దిమంది తెలగాణ్యేతరులకి మాత్రమే తెలుసు. కానీ తతిమ్మా నాన్-తెలంగాణ ప్రాంతంలో ఎవఱికీ తెలియదు. ఆంధ్రప్రాంతీయుల మీద హఠాత్తుగా తెలంగాణలో పెల్లుబికిన అకారణ ద్వేషాన్ని (ఆంధ్రవారిని పొడిచి చంపేయాలన్నంత కసి - అవసరమైతే ఆంధ్రాహిందువుల్ని చంపడానికి బి.జె.పి/ ఎ.బి.వి.పి. మద్దతు) చూసి ఆంధ్రప్రాంతీయులు చాలా షాక్ కి, మనోవేదనకీ గుఱవుతున్నారు. వారీ నీలాపనిందల్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మళ్ళీ ప్రాంతాల మధ్య సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశాల గుఱించి వారు విచారిస్తున్నారు. కానీ ఇందులో సదరు టి.ఆర్.ఎస్. పుస్తకం పోషించిన పాత్ర ఎవఱి దృష్టికీ రావడంలేదు.

    ఆ పుస్తక సారాంశం గుఱించి కొంచెం ఇక్కడ రాస్తాను :

    స్థూలంగా వారి వాదన ఇలా ఉంది :(బ్రాకెట్లలోనివి నా వ్యాఖ్యలు)

    ౧. తెలంగాణ మొదట్నుంచి వెనకబడ్డ ప్రాంతం కాదు. ఆంధ్రప్రదేశ్ లో కలిశాకనే వెనకబడ్డం మొదలయింది. అంతకుముందు ఆంధ్రప్రాంతం కంటే తెలంగాణ ఆర్థిక పరిస్థితి బావుంది. (నిజమేంటంటే - తెలంగాణ అనే రాష్ట్రమేదీ అప్పటికీ లేదు. అప్పటికి ఉన్నది తెలుగు, కన్నడ, మరాఠీ, ఉర్దూ జిల్లాలతో కూడుకున్న హైదరాబాద్ స్టేట్ మాత్రమే. కానీ తెలంగాణ అని ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి అంతకు రెండుమూడేళ్ళముందునుంచి హైదరాబాద్ స్టేట్ లోటుబడ్జెట్‌లో ఉంది) అది చూసి తెలంగాణ సంపదల్ని (ఏమిటో అవి) దోచుకోవడం కోసమే ఆంధ్రప్రాంత నాయకులు నెహ్రూ దగ్గఱ తమ పలుకుబడి ఉపయోగించి బలవంతంగా రెండు ప్రాంతాల్నీ కలిపారు.

    (ఒక రాష్ట్రాన్ని ఇంకో రాష్ట్రంతో కలిపేటంత గొప్ప పలుకుబడి ఉన్నవాళ్ళు ధర్మపురి, కృష్ణగిరి, కోలారు, బళ్ళారి, గంజామ్, కోరాపుట్, బరంపురం మొదలైన అనేక తెలుగుజిల్లాల్ని ఎందుకు కోల్పోయారు ? ఛత్తీస్‌గఢ్‌లో కలిసిపోయిన దంతివాడ జిల్లాని ఎందుకు తిరిగి రాబట్టుకోలేకపోయారు ? మద్రాసు నగరాన్ని సైతం ఎందుకు పోగొట్టుకున్నారు ? కొత్త రాజధాని నిర్మాణం కోసం నెహ్రూ నుంచి నిధులు కూడా ఎందుకు సంపాదించలేకపోయారు ? అవన్నీ మనం అడక్కూడదు. హైదరాబాద్ స్టేట్ లోని తెలుగుజిల్లాలు ఆంధ్రప్రాంతంతో కలవాలని అప్పటి హైదరాబాద్ రాష్ట్ర శాసనసభలో అధికసంఖ్యాక ఎమ్మెల్యేలు వోటింగ్ చేసిన ఫలితంగానే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో భాగమైంది. అది బలవంతంగా కలపడం ఎలా అవుతుంది ? కలిపినవాడు బూర్గుల రామకృష్ణారావు. తెలంగాణవాడు, ఆంధ్రావాడు కాదు. ఈ సందర్భంగా ఆ కాలపు మహానాయకులు ఎప్పుడూ అనని మాటల్ని కూడా నిజంగా అన్నట్లు ప్రచారం చేస్తున్నారు. తమ వేర్పాటువాదం పూర్వీకుల స్ఫూర్తి (inspiration) తో నడుస్తోందని చెప్పుకోవడమే ఇందులోని అసలు ఉద్దేశం. వాళ్ళు అలా అన్నారనడానికి చారిత్రిక లిఖిత ఆధారాలు చూపమని నిగ్గదీసి ఖరాఖండిగా అడిగితే చూపలేకపోతున్నారు. ఉదాహరణకి - ఆంధ్రా, తెలంగాణ కావాల్సినప్పుడు విడిపోవచ్చునని నెహ్రూ అన్నాడట. అలాగే బూర్గుల రామకృష్ణారావు హైదరాబాద్ శాసనసభలో సమైక్య తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి ముందు న్యూఢిల్లీ వెళ్ళొచ్చి "నా మరణశాసనం నేను రాసుకున్నాను" అన్నాడట. దీనికింకో పాఠాంతరం (version) ఏంటంటే - "సమైక్య తీర్మానం ద్వారా తెలంగాణకి మరణశాసనం రాశాను" అన్నాడని కూడా చెబుతున్నారు.)

    ౨. పెద్దమనుషుల ఒప్పందం ఉల్లంఘించారు.

    (ఈ ఒప్పందం పేరుకే ఒప్పందం. అందులో ద్వైపాక్షికత (bi-partite-ness) దయనీయంగా లోపించింది. వాస్తవానికి అది తెలంగాణ నాయకులు ఆంధ్రప్రాంత నాయకుల నెత్తిమీద బలవంతంగా ఏకపక్షం (unilateral) గా రుద్దడానికి చూసిన అసంబద్ధ, సంకుచిత నియమావళి. అది పూర్తిగా తెలంగాణకే అనుకూలంగా ఉందనీ, ఆంధ్రప్రాంత ప్రయోజనాల ఊసే అందులో లేదనీ మనకి గుర్తురాకపోతే బావుంటుంది)

    ౩. తెలంగాణవారి నిధులూ, నీళ్ళూ, నియామకాలూ, వనరులూ అన్నీ దోచుకున్నారు. కనుక ఆంధ్రావాళ్ళు దొంగలు, బందిపోట్లు, వలసవాదులు. బ్రిటీషర్లవంటివాళ్ళు. వాళ్ళని వెళ్లగొడితేనే తెలంగాణకి నిజంగా స్వాతంత్ర్యం వచ్చినట్లు. లేకపోతే తెలంగాణది బానిసబతుకే.

    (తెలంగాణ నిధులు అని చెప్పబడేవి 80 శాతం వఱకు హైదరాబాద్ మఱియు దాని పరిసర మండలాల నుంచి వచ్చేవి. అసలు రాష్ట్రం యొక్క స్థూల దేశీయోత్పత్తి (GDP) లోనే 60 శాతం కంటే ఎక్కువ "ఈ చోటు" నుంచి వస్తోంది. మిగిలిన యావత్తు రాష్ట్రం యొక్క స్థూల దేశీయోత్పత్తి అంతా కలిపి పిసికి పిండి చేసినా 40 శాతం కంటే తక్కువే. ఆ హైదరాబాదీ నిధుల్లో 70 శాతం వఱకు అక్కడి ఆంధ్రప్రాంత, ఉత్తరాది (North Indian) ప్రజల వృత్తివ్యాపారాల నుంచి, వారు చెల్లించే ఆస్తిపన్నుల నుంచి సమకూడేది. తెలంగాణరాష్ట్రం ఏర్పడితే వీటిల్లో సగం ఆంధ్రరాష్ట్రానికి తఱలిపోతాయి. ఎందుకంటే ఫ్యాక్టరీ ఎక్కడున్నప్పటికీ ఎక్కడ రిజిస్టర్డ్ ఆఫీసు ఉందో అక్కడి ప్రభుత్వానికి పన్నుకట్టాలి. ప్రస్తుతం ఇక్కడ ఆం.ప్ర.. రాజధాని ఉంది కనుక ఇక్కడ రిజిస్టర్డ్ ఆఫీసులు పెట్టారు. కనుక ఆంధ్రప్రాంతీయులు అనుభవిస్తున్నవి తమ నిధులే. ఇందులో తెలంగాణ ప్రసక్తి అనవసరం.

    నీరు పల్లానికి పారడం ప్రకృతిసహజం. అది ఆంధ్రప్రాంతీయుల తప్పు కాదు. తమ దురదృష్టానికి అయిదున్నఱకోట్లమంది ఆంధ్రవారిని దొంగలు, దొంగలని పదేపదే నిందించడం అనాలోచితమూ, అసూయాపూరితమూ, అసమంజసమే కాదు, మహాపాపం కూడా ! తెలంగాణ యొక్క నీటివనర్లని దోచుకునే ఉద్దేశంతో ఆంధ్రవారు కట్టిన ప్రాజెక్ట్ ఏదీ లేదు. ఎందుకంటే బ్రిటీషువారు వెళ్ళిపోయిన తరువాత మన రాష్ట్రంలో శ్రీశైలం, నాగార్జునసాగర్ తప్ప ఆ స్థాయి గల పెద్ద ప్రాజెక్టులేవీ కట్టలేదు. నాగార్జునసాగర్ యొక్క ప్రణాళికారచన మఱియు శంకుస్థాపన ఆంధ్రప్రదేశ్ ఏర్పడకముందే, తెలంగాణ ఆంధ్రలో కలవకముందే 1955 లో తెలంగాణ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు ఆధ్వర్యవంలో జఱిగింది. ధవళేశ్వరం. ప్రకాశం బ్యారేజి లాంటివన్నీ బ్రిటీషువారు నదులకు లోతట్టు (downstream) లో కట్టినవి. వాటికి ఆంధ్రప్రాంతీయులు బాధ్యులు కారు. ప్రస్తుతం జలయజ్ఞం పేరుతో కొన్ని కడుతున్నారు గానీ వాటిల్లో తెలంగాణకి మేలు చేసేవే 60 శాతం వఱకు ఉన్నాయి. బడ్జెట్ కేటాయింపులు కూడా తెలంగాణకే అధికభాగం వెళుతున్నాయి. ప్రతిపాదిత ఆయకట్టు కూడా 60 శాతం తెలంగాణదే.

    ఇహపోతే నియామకాలు : ఇదొక పాతపాట. ఇది చెన్నారెడ్డి పాడిన పాచిపాట. వాస్తవం చెప్పాలంటే ఇది ఈ కాలానికి వర్తించదు. ఎందుకంటే 1974 లో రాష్ట్రపతి ఉత్తర్వులూ, జోనల్ నియామకాల పద్ధతీ వచ్చాక మన రాష్ట్రంలో ప్రతివాడూ బలవంతంగా తాను పుట్టిన జోన్ కే పరిమితం చేయబడ్డాడు. మిహతా జోన్ లలో నాన్-జోన్ వ్యక్తికి ఉద్యోగం రాని పరిస్థితి. అటువంటప్పుడు తెలంగాణవారి ఉద్యోగాల్ని ఆంధ్రావాళ్ళు కొట్టేయడం ఎలా సాధ్యం ? అనే ప్రశ్న లేవనెత్తకుండా/ లేవనెత్తనివ్వకుండా పొలోమని ప్రచారం చేసేస్తున్నారు. ఈ పాట టి.ఆర్.ఎస్. పెట్టిన కొత్తల్లో లక్షా అఱవై వేల తెలంగాణ ఉద్యోగాలతో మొదలయింది. ఆ తరువాత పాట పెంచారు - మూడులక్షలన్నారు. కాదు, కాదు, నాలుగు లక్షలన్నారు. ఇప్పుడేమో ఏకంగా ఆఱు లక్షలంటున్నారు. ఆంద్రోల్లు ఎల్లిపోతే ఆ ఉద్యోగాలన్నీ మనకే అని తెలంగాణ పల్లెప్రాంతాల్లో హోరుగా జోరుగా ప్రచారం చేసేశారు. వాళ్ళు అదంతా నమ్మి నిజంగానే ఆంద్రోల్లంతా విలన్‌లనీ, ఆంద్రోల్లు ఎల్లిపోతేనే గాని తాము బాగుపడమనీ గుడ్డిగా విశ్వసిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వోద్యోగాల్లో తెలంగాణకి రావాల్సిన శాతం ప్రకారం ఆఱులక్షల ఉద్యోగాలు రావాలట. అసలు ఇప్పుడక్కడ ఉన్నదే తొమ్మిది లక్షల మంది ఉద్యోగులు కాగా ఒక్క తెలంగాణ ప్రాంతానికే ఆఱులక్షల ఉద్యోగాలెలా వస్తాయనే ప్రశ్నకి సమాధానం లేదు. పైగా అవి ఖాళీలు (vacancies) కూడా కావు. ఆ కుర్చీల్లో ఇప్పుడు జనం హాజరుగా ఉన్నారు. మఱి తెలంగాణ వస్తే ఏ కొత్త ఉద్యోగాలివ్వబోతున్నారు ? ఎన్ని కొత్తఖాళీలని సృష్టించబోతున్నారు ? ఇప్పుడు మనం వాళ్ళ దగ్గఱికి పోయి "అది కాదయ్యా బాబూ ! అసలు పరిస్థితి వేఱుగా ఉంది" అని నిజం చెప్పబోయినా వాళ్ళు వినిపించుకునే పరిస్థితి లేదు. అంతగా జనానికి గోబెల్స్ ప్రచారంతో పిచ్చెక్కించేశారు.

    తెలంగాణ వనరులట. ఆంద్రోల్లు దోచుకుంటున్నారట. ఏమున్నాయబ్బా, తెలంగాణలో అంత విఱగబడిపోయే వనరులు, ఆంద్రోల్లు వాటిని భారీ స్థాయిలో దోచుకోవడానికి ? ఎన్నిసార్లు లెక్కపెట్టుకున్నా హైదరాబాదులో ఆంధ్రప్రాంతీయుల పెట్టుబడుల ద్వారా పెఱిగిన భూమి విలువలు లేదా సింగరేణి బొగ్గు తప్ప ! వాస్తవానికి పనికొచ్చే ప్రకృతివనరులన్నీ ఆంధ్రప్రాంతంలోనే ఉన్నాయి. అక్కడ ప్రకృతిసిద్ధంగా సారవంతమైన వ్యవసాయభూములే కాక సున్నపురాయి, ఆస్బెస్టాస్, బాక్సైట్, సోడియమ్, మ్యాంగనీస్, గ్రానైట్, యురేనియమ్, ఇనపఖనిజం, వజ్రాలు, గ్యాస్, పెట్రోలియమ్ ఇలా లెక్కలేనన్ని వనరులున్నాయి. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే తెలంగాణవాదుల దృష్టిలో దొంగలైన ఆంధ్రవారి వనరులు ఇతరరాష్ట్రాలవారి చేతుల్లో నిరంతర దోపిడికి గుఱికావడం, ఆంధ్రప్రాంతీయులు తమ దగ్గఱి వనర్లని తామే దోచుకోలేని నిస్సహాయస్థితిలో ఉండడం)

    (ఇంకా ఉంది) 26.1.10అంతిమంగా అంతా మంచే జఱుగుతుంది
    8:50 PM వీరిచే పోస్ట్ చెయ్యబడింది LBS తాడేపల్లి
    లేబుళ్లు: తెలుగు - తెలుగుజాతి - తెలుగునేల

    విజయవాడ రైల్వేస్టేషన్‌లో ఆగి ఉంది హైదరాబాదు వెళ్ళే ఆ పొగబండి. అందులో ఒక పెట్టెలో ఇద్దఱు స్త్రీలలో ఒకామె కింది బెర్తులో కూర్చున్న పురుషుణ్ణి అడుగుతున్నది. "సార్ ! ఈమె గర్భవతి. పైబెర్తుమీదికెక్కడం ఈమెకి మంచిది కాదు. అది మీరు తీసుకొని మీ బెర్తు మాకిస్తారా ? ప్లీజ్" అని !

    అతను అనూహ్యంగా ఒక ప్రశ్న వేశాడు. "మీరు ఆంద్రోల్లా ?"

    "అవునండీ !"

    "అయితే ఇంకోల్లని అడుక్కోండి. నేనియ్య"

    ’ఈమధ్యకాలంలో తెలంగాణ నాయకులు ఎంత పెద్ద స్థాయిలో, ఎంత విస్తృతంగా రాజకీయాలతో సంబంధం లేని సామాన్య తెలంగాణ ప్రజల మనస్సుల్ని సైతం ఎలా ద్వేషకలుషితం కావించారో దానికి ఇదొక ప్రత్యక్ష దృష్టాంతం’ అనిపించింది. దీని గుఱించి తరువాత రాస్తాను. అయితే నా దృష్టిలో ఈ పరిస్థితి తాత్కాలికమే. ప్రపంచంలో రాష్ట్రవిభజనలూ జఱిగాయి. దేశవిభజనలూ జఱిగాయి. కానీ ఒక జనజాతికి ఇష్టం లేకుండా దాన్ని ఎల్లకాలం పరిపాలించడం ఎలాగైతే సాధ్యపడదో, అలాగే రాజకీయ స్వాతంత్ర్యం గలిగిన ఒక జనజాతిలో ఒక పెద్దభాగం యొక్క ఇష్టపూర్వకమైన అంగీకారం లేకుండా దాన్ని విభజించడం కూడా అలాగే సాధ్యపడదు. అలాంటి ప్రయత్నాలు చరిత్రలో ఎప్పుడూ సఫలం కాలేదు. అమెరికా సంయుక్త రాష్ట్రాల చరిత్ర గానీ ప్రపంచంలోని అనేక ఇతర అంతర్యుద్ధాల (civil wars) విషయం గానీ దీన్నే నిరూపిస్తున్నది. అందుచేత ఆంధ్రప్రదేశ్ విభజనకి గుఱయ్యే అవకాశాలు తక్కువ. గతనెల ఈ రాష్ట్రం ఆ అంచుదాకా వెళ్ళిన మాట నిజం. కానీ అలా వెళ్ళినది కాస్తా ఆంధ్రప్రాంత సోదరుల జోక్యంతో వెనక్కొచ్చింది. ఇలా అడ్డుకున్నందుకు తెలంగాణ సోదరులు ఆంధ్రసోదరులపై ప్రస్తుతానికి మండిపడినప్పటికీ సుదూర భవిష్యత్తులో వారూ, వారి సంతానమూ ఈ పరిణామానికి సంతోషించి తప్పకుండా కృతజ్ఞతలు చెప్పే రోజొస్తుంది. నా ఉద్దేశంలో - ఇది వారి మంచి కోసమే జఱిగింది, భగవత్‌సంకల్పానుసారమే జఱిగింది. వారిప్పుడు జ్వరంలో ఉన్నారు. ఈ జ్వరం సిద్దిపేటకి చెందిన ఒకానొక మలేరియా దోమ కుట్టడం వల్ల వచ్చింది. జ్వరం మీద ఏం చెప్పినా అర్థం కాదు. ఒళ్ళు తెలియకుండా ఏవేవో కలవరింతలు. మధుర పదార్థాలు కూడా విషంలా పనిచేస్తాయి. కళ్ళు తెఱిస్తే విపరీతమైన కళ్ళమంట. కాంతిని భరించలేరు. శబ్దాల శ్రావ్యతని ఆస్వాదించలేరు. జ్వరంలో కూర్చుని ఆలోచించినా, మాట్లాడినా జ్వరం పెఱిగిపోతుంది. మగతలో పడి మనుషుల్ని గుర్తుపట్టలేరు. ఎవఱు శత్రువులో, ఎవఱు మిత్రులో అర్థం చేసుకోలేరు. ఇది ప్రస్తుతం తెలంగాణవారున్న పరిస్థితి. ఈ పూనకం పూర్తిగా దిగి వారు మళ్ళీ మామూలు మనుషులయ్యే రోజు త్వరలోనే వస్తుంది. దీనికి తగిన చికిత్సకుడు కాలపురుషుడే. అయితే జ్వరాలు మనుషుల్ని చంపవు. ఎక్కడ పొఱపాటు చేశామో తెలియజేస్తాయి. అంతే !

    ఇలా జఱగాల్సి ఉంది కనుక ఇలా జఱుగుతున్నది. దీని సమయం దాటిపోగానే ఇది ఎలా వచ్చిందో అలాగే సమసిపోతుంది. అప్పుడు వీర వేర్పాటువాదులు కాస్తా వీరసమైక్యవాదులుగా అవతరించడాన్ని మీ కళ్ళతో మీరే చూస్తారు. "అవునూ ! ఆరోజు మనం ఎందుకలా మాట్లాడామంటావ్ ?" అని వాళ్ళలో వాళ్లే ఆశ్చర్యపోతారు. దీని గుఱించి ఎవఱూ నిద్రలు మానుకుని ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఇందులో బాధపడాల్సిందేమీ లేదు. జాతీయవాదాలు కాలపురుషుడి కఠినపరీక్షలకి తట్టుకొని నిలబడినప్పుడే అవి శాశ్వతమౌతాయి. ఇది తెలుగుజాతికి ఒక తాత్కాలిక పరీక్షే తప్ప వారి సమైక్యాన్ని శాశ్వతంగా అంతం చేసేటంత సామర్థ్యం కలిగినది కాదు. ప్రపంచంలోని అనేక భాషాజాతులతో పోలిస్తే తెలుగువారి రాజకీయ సమైక్యానికి మఱీ ఎక్కువ వయసు లేదు. యునైటెడ్ స్టేట్స్ 230 సంవత్సరాల నుంచి సమైక్యంగా ఉంది. ఇంగ్లండు 700 సంవత్సరాల నుంచి సమైక్యంగానే ఉంది. థాయ్‌లాండ్ 400 ఏళ్ళనుంచి సమైక్యంగానే ఉంది. జపాన్ 2000 (అక్షరాలా రెండువేల) సంవత్సరాల నుంచి సమైక్యంగానే ఉంది. "54 ఏళ్ళనుంచి... 54 ఏళ్ళనుంచి..." అని ఎన్నిసార్లు గొంతు చించుకున్నా 54 ఏళ్ళంటే పెద్ద కాలమేమీ కాదు. మన దేశంలో సగటు భార్యాభర్తల కాపరానిక్కూడా ఆ మాత్రం వయసు సర్వసాధారణం. అలాంటిది ఒక మహాజాతి చరిత్రలో 54 ఏళ్ళు ఒక లెక్కా జమా ? అంటే దానర్థం తెలగాణ్యులు గానీ, ఆంధ్రప్రాంతీయులు గానీ తాము ఒకఱి గుఱించి ఒకఱు ఏదో యమా కనిపెట్టేశామనీ, కూలంకషంగా తెలిసేసుకున్నామనీ అనుకోవడమూ, ఆ ప్రాతిపదికన వివాదపడడమూ అజ్ఞానజనితం, అమాయకత్వం.

    మిత్రమా ! మనం కలిసి వెళ్ళాల్సిన దూరం ఇంకా చాలా ఉంది. తగినంత దూరం వెళ్ళకముందే అపార్థం చేసుకోవడం సరికాదు. నాతో వ్యవహరించడం నువ్వెలాగైతే అభ్యసిస్తున్నావో నేనూ అలాగే అభ్యసిస్తూ ఉన్నాను. నేను నీకంటే సర్వజ్ఞుడినై తప్పులు చేస్తున్నానని నువ్వు భావిస్తున్నది సమీచీనం కాదు సుమా ! నేను నువ్వనుకుంటున్నంత శక్తిమంతుణ్ణి గానీ, సర్వజ్ఞుణ్ణి గానీ కాను. నేనూ నీలాంటివాణ్ణే. నేర్చుకోవడానికి నాకూ ఒక అవకాశమివ్వు.

    మనుషులు గానీ, జాతులు గానీ, ప్రాంతాలు గానీ తమ అధీనంలో తాము ఉండి, పూర్తిగా తమ స్వసంకల్పానుసారంగా తాము ప్రవర్తించజాలవు. అన్నీ/ అందఱూ కాలపురుషుడికి అధీనమే. తెలుగువాళ్ళు 1995 నుంచి 2014 దాకా 19 ఏళ్ళపాటు ఇలా అంతర్గత వివాదాలతో సతమతం కావాల్సి ఉంది. కనుక ఆ ప్రకారమే సతమతమవుతున్నారు. విడిపోవడానిక్కాదు ఆంధ్రప్రదేశ్ 1956 లో ఏర్పడినది. విడిపోవడానిక్కాదు ఇది గతంలో ఇలాంటి వేర్పాటువాదాల్ని తట్టుకొని నిలబడినది. మనల్ని విడిపొమ్మని కాదు ఈ వేర్పాటువాదాలు సూచిస్తున్నది. తద్ద్వారా మన ఆచరణలోని లోటుపాట్లని సూచిస్తూ, ఇప్పటివఱకు అయిన అనుభవాల నుంచి సరికొత్త సమైక్య పాఠాలు నేర్చుకొమ్మని మాత్రమే అవి సందేశిస్తున్నాయి. ఒక జాతిగా మనల్ని మనం నియంత్రించుకుంటూ బాధ్యతాయుతజాతిగా రూపొందే పరిణామక్రమంలో ఈ వేర్పాటువాదాలొక భాగం. ఎదుగుతున్న పిల్లలు (adolescent children) తమ పెద్దల మీద తాత్కాలికంగా తిరుగుబాటు చేస్తారు. వారు పూర్తిగా ఎదిగినాక తిరుగుబాట్లు మాయమై మిత్రులుగా మారతారు. గతంలో 1930 ప్రాంతాల్లో రాయలసీమవారు ఇంతకంటే ఎక్కువగా తెలుగుకోస్తాని ద్వేషించేవారని మర్చిపోకూడదు. వారు ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చేఱడానికి తిరస్కరించిన చరిత్ర నమోదై ఉంది. కానీ ఈనాడు సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం కోస్తావారికంటే వారే ముందుండడం గమనార్హం. వారి పాత్రని భవిష్యత్తులో తెలంగాణ సోదరులు తీసుకుంటారు. రాష్ట్రంలోని వేర్పాటువాదాల్ని ఉక్కుపాదంతో అణచివేయాలని తెలంగాణవారే కోరే రోజులొస్తాయి. ఇందుక్కనీసం రెండుమూడు దశాబ్దాలు పట్టుతుంది. మొత్తమ్మీద ఎలాగైనా సరే, మనం మన ప్రాంతాలవారీగా తాత్కాలికంగా నష్టపోయినా ఫర్వాలేదు, మన ప్రాంతం మీద ఇతరప్రాంతాలే బాగుపడ్డా ఫర్వాలేదు గానీ, మన మహాజాతిక్కూడా ఇతరజాతుల మాదిరే ఒక సుదీర్ఘ సమైక్య చరిత్రని ఏర్పఱచాలి. అదే నా ఆశ. అదే నా ధ్యాస.

    తొందఱపడకండి తెలంగాణ మిత్రులారా ! ఈ సందర్భంగా ఏదో ఒక పాత తెలుగు సినిమాలో ఒక స్వామీజీ మాటలు నాకు గుర్తొస్తున్నాయి. "ఎంతగా ద్వేషిస్తున్నావో అంతగా తపించే రోజులూ వస్తాయి నాయనా !"